CM Cup 2026: 'సీఎం కప్–2026' ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం!

CM Cup 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'సీఎం కప్-2026' క్రీడల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

Update: 2026-02-18 12:14 GMT

CM Cup 2026: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులను ఉత్సాహపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'సీఎం కప్-2026' క్రీడల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 20వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావలసిందిగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానం అందింది.

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఛైర్మన్ శివసేన రెడ్డి, మరియు క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ డాక్టర్ సోనిబాలా దేవి కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. క్రీడల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు.

ఫిబ్రవరి 20న ప్రారంభం కానున్న ఈ క్రీడల కోసం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో ఈ సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.

తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ సీఎం కప్-2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

Tags:    

Similar News