ICC Rankings 2026: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపుతోన్న టీమిండియా.. దూసుకొచ్చిన ఇషాన్ కిషన్!
ICC Rankings 2026: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ దుమ్మురేపుతోంది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటుతోంది.
ICC Rankings 2026: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపుతోన్న టీమిండియా.. దూసుకొచ్చిన ఇషాన్ కిషన్!
ICC Rankings 2026: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ దుమ్మురేపుతోంది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో భారత ఆటగాళ్లు టాప్ స్థానాల్లో నిలుస్తూ.. ప్రపంచ క్రికెట్‌లో తమ సత్తా నిరూపిస్తున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శన జట్టుకు భారీ బలంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ లేపింది.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకున్నాడు. అతడి ఖాతాలో 891 పాయింట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్‌లో విఫలమైనా.. అభిషేక్ అగ్ర స్థానములో కొనసాగుతున్నాడు. ఫిల్ సాల్ట్ (808) రెండో స్థానంలో ఉన్నాడు. సెంచరీ హీరో పాతున్ నిశాంక (786) మూడో స్థానానికి దూసుకొచ్చాడు. 4, 5 ర్యాంకుల్లో తిలక్ వర్మ (751), సహబ్జాద ఫర్హాన్ (748) ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో ఉండగా.. ఇషాన్ కిషన్ ఎనిమిదో స్థానం కైవసం చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా అద్భుత ఇన్నింగ్స్‌లతో అలరించడంతో టాప్ 10లోకి వచ్చాడు.
ఆల్‌రౌండర్ విభాగంలో కూడా భారత్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మూడో స్థానంలో ఉండగా, యువ ఆటగాడు శివమ్ దూబే తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరూ బ్యాట్, బాల్‌తో జట్టుకు కీలకంగా మారుతున్నారు. పాకిస్థాన్ క్రికెటర్ సైమ్ అయూబ్ (303), జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (297) మొదటి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ ర్యాంక్ దక్కించుకోవడం మరో విశేషం. అతని మిస్టరీ స్పిన్ ప్రపంచ బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. రషీద్ ఖాన్ (740) రెండో ర్యాంకు, అబ్రార్ అహ్మద్ (734) మూడో స్థానంలో ఉన్నారు.
మొత్తంగా చూస్తే ఐసీసీ టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో కూడా భారత్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు టాప్ ర్యాంకుల్లో ఉండటం ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఇదే ఫామ్ కొనసాగితే భవిష్యత్ టోర్నీల్లో భారత్‌ను ఓడించడం ఇతర జట్లకు కష్టసాధ్యమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.