Prasidh Krishna : పరుగుల వరద పారిస్తున్నా ఆపడం లేదు..పేలవమైన ఫామ్ ఉన్నా ప్రసిద్ధ్ కృష్ణకు వరుస అవకాశాలెందుకు ?

దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన పేలవమైన బౌలింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Update: 2025-12-05 05:10 GMT

Prasidh Krishna : పరుగుల వరద పారిస్తున్నా ఆపడం లేదు..పేలవమైన ఫామ్ ఉన్నా ప్రసిద్ధ్ కృష్ణకు వరుస అవకాశాలెందుకు ?

Prasidh Krishna : దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన పేలవమైన బౌలింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రాంచీ, రాయ్‌పూర్ వన్డేల్లో అతడు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా రెండో మ్యాచ్‌లో ఓటమి మూటగట్టుకుంది. టెస్ట్, టీ20, వన్డే ఫార్మాట్‌లలో దారుణమైన ఎకానమీ రేట్ ఉన్నప్పటికీ, ప్రసిద్ధ్ కృష్ణకు భారత జట్టు మేనేజ్‌మెంట్ వరుసగా అవకాశాలు ఇవ్వడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

టీమిండియా ప్రసిద్ధ్ కృష్ణను 2027 ప్రపంచ కప్‌కు పెట్టుబడిగా చూస్తోంది. తదుపరి వన్డే ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్‌లు ఎక్కువ బౌన్స్ కలిగి ఉంటాయి. ప్రసిద్ధ్ కృష్ణ హిట్ ది డెక్ రకం బౌలర్. అంటే, బంతిని పిచ్‌పై గట్టిగా కొట్టి వేయడం ద్వారా అదనపు బౌన్స్ ను సృష్టించగలడు. దక్షిణాఫ్రికా పిచ్‌లకు ఈ రకమైన బౌలర్ చాలా అవసరం. అందుకే భారత జట్టు అతడికి ఇప్పుడే ఎక్కువ అవకాశాలు ఇచ్చి, భవిష్యత్ మెగా టోర్నమెంట్‌ల కోసం సిద్ధం చేస్తోందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత జట్టుకు ప్రసిద్ధ్ కృష్ణ లాంటి బౌలర్లు చాలా తక్కువగా ఉన్నారు. భారతదేశంలో సాధారణంగా స్వింగ్ లేదా సీమ్ బౌలర్లు ఎక్కువగా ఉంటారు. కానీ, ప్రసిద్ధ్ కృష్ణ తన మంచి హైట్ ను ఉపయోగించి బంతికి వేగంతో పాటు అదనపు బౌన్స్ ను కూడా ఇవ్వగలడు. ఈ అదనపు బౌన్స్ వల్ల బ్యాట్స్‌మెన్‌లు షాట్లు ఆడటానికి ఇబ్బంది పడతారు, ఫలితంగా వికెట్లు పడే అవకాశాలు పెరుగుతాయి.

భారత పిచ్‌లపై ఈ బౌలింగ్ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, సౌతాఫ్రికా లాంటి విదేశీ పిచ్‌లపై అతడి బౌలింగ్ అద్భుతాలు చేయగలదని టీమ్ మేనేజ్‌మెంట్ నమ్ముతోంది. ప్రసిద్ధ్ కృష్ణపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా గొప్ప నమ్మకం ఉంది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, కృష్ణను టీమ్ ఇండియా భవిష్యత్తు అని అభివర్ణించాడు. అయితే గాయాల కారణంగా అతడి కెరీర్ కొద్దిగా అస్థిరంగా మారింది. ప్రస్తుతం ప్రసిద్ధ్ కృష్ణ పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ చూపుతున్న ఈ నమ్మకానికి అతడు ఎలా సమాధానం చెబుతాడో చూడాలి.

Tags:    

Similar News