కాట్రెల్ సిక్స్‌కి నెటిజన్లు ఫిదా..

వెస్టిండీస్‌ యువ పేస్ బౌలర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌ మరోసారి మెరిశాడు. ఈ సారి బౌలింగ్ కాదు బ్యాట్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Update: 2020-01-10 14:02 GMT

వెస్టిండీస్‌ యువ పేస్ బౌలర్‌ షెల్డాన్‌ కాట్రెల్‌ మరోసారి మెరిశాడు. ఈ సారి బౌలింగ్ కాదు బ్యాట్ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి వికెట్ రూపంలో వచ్చిన కాట్రెల్ భారీ సిక్స్ కొట్టి విండీస్ జట్టుకు చిరస్మరణీయ వియూజయాన్ని అందించాడు. గత ఐపీఎల్ వేలంలో షెల్డాన్‌ కాట్రెల్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.8.5 కోట్లకు కనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కనీస ధర 50 లక్షల రూపాయలు ఉంటే అతన్ని ఎక్కువ పెట్టి కొనుగోలు చేసింది. దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ విమర్శించిన సంగతి తెలిసిందే.

కాగా... గురువారం ఐర్లాండ్‌-వెస్టిండీస్ టీముల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో కాట్రెల్ మెరిశాడు. ఐర్లాండ్‌ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఐర్లాండ్ నిర్ధేశించిన లక్ష్యాణ్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ తడబడింది. వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి విజయానికి చేరువగా వచ్చింది. కాగా, ఆఖరి వరకు పోరాడిన వెస్టిండీస్ చివరి ఓవర్లు విజయానికి ఐదు పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి పరుగు రాబట్టలేదు. రెండో బంతికి వాల్ష్ సింగల్ కాట్రెల్ బ్యాటింగ్ ఇచ్చాడు. మూడు, నాలుగో బంతులకు సింగల్ వచ్చినా.. కాట్రెల్ రెండుసార్లు రనౌట్ నుంచి త్పపించుకున్నాడు. రెండు బంతుల్లో రెండు పరుగులు అవసంరం దీంతో కాట్రెల్ కవర్స్ దిశగా భారీ సిక్సర్ బాది విజయం అందించాడు.

ఒక భారీ సిక్సర్‌తో గెలిపించిన కాట్రెల్ ఓ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సిక్సర్ తో మ్యాచ్ గెలిపించిన తొలి 11 నెంబర్ బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. కాట్రెల్ బాదిన సిక్సర్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కొట్రెల్ సిక్సర్‌కు నెటిజన్లు ప్రశంసలతో ముంచుతున్నారు. ఈ మ్యాచ్ విజయంతో విండీస్ మూడు వన్డేల సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. 

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 237 చేసింది. ఐర్లాండ్ స్టిర్లింగ్ (63) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పోర్టర్ఫీల్డ్ (29), కెవిన్ ఓబ్రైన్ (31), సిమి సింగ్ (34) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4వికెట్లు దక్కించుకున్నాడు. కాట్రెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నికోలస్ పూరన్‌ (52), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (40) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ షై హోప్ (25) పరుగులు చేశాడు. హెట్మియర్ (6), బ్రాండన్ కింగ్ (0) ఔట్ అయ్యారు.

షెడన్ కాట్రెల్ భారత పర్యటనలో వెలుగులోకి వచ్చాడు. కోహ్లీ వికెట్ తీసి సెల్యూట్ తో సంబరాలు చేసుకున్నాడు. దీంతో అందరి దృష్టి కాట్రెల్ పై పడింది. కాట్రెల్ ఈ సెల్యూట్‌తో క్రికెట్ అభిమానులకు దగ్గరైయ్యాడు. కాట్రెల్ బౌలింగ్ లో కాదు బ్యాటింగ్ లో కూడా ఇరగదీశాడు. దీంతో ఐపీఎల్ 2020 పంజాబ్ జట్లుకు కాట్రెల్ రూపంలో ఆల్ రౌండర్ దొరికినట్లే. 




Tags:    

Similar News