LSG vs RCB: లక్నో వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌‌లో కోహ్లీ, గంభీర్‌ మధ్య వార్

LSG vs RCB: కోహ్లీ, గంభీర్‌ మధ్య పేలిన మాటల తూటాలు

Update: 2023-05-02 02:40 GMT

LSG vs RCB: లక్నో వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌‌లో కోహ్లీ, గంభీర్‌ మధ్య వార్ 

LSG vs RCB:  లక్నో వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ, గంభీర్‌ మరోసారి గొడవకు దిగారు. మ్యాచ్‌ అనంతరం ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీయడంతో సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకొని విడదీసారు. అమిత్ మిశ్రా కోహ్లీని అడ్డుకోగా.. కేఎల్ రాహుల్ గంభీర్‌ను పక్కకు తీసుకెళ్లాడు. వీరి గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. లక్నో జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 108 పరుగులకే చతికిలపడింది. లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో 18 పరుగులతో పరాజయం పాలైంది. సాధారణంగానే అగ్రెసివ్‌గా కనిపించే విరాట్‌ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మరింత దూకుడుగా కనిపించాడు.

మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలోనే గంభీర్-కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుగా లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన గంభీర్, అతనితో మాట్లాడకని సైగ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనికి కోహ్లీ స్పందించడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. అమిత్ మిశ్రాతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పాటు లక్నో టీమ్ ప్లేయర్లంతా కలిసి విరాట్ కోహ్లీకి సర్ది చెప్పి, అతన్ని వెనక్కి పంపించారు.

ఈ గొడవకి కారణం ఈ రెండు టీమ్స్ మధ్య బెంగళూరులో జరిగిన మ్యాచేనని తెలుస్తోంది. బెంగళూరులో ఆర్‌సీబీని 1 వికెట్ తేడాతో ఓడించింది లక్నో. ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి లక్నో గెలవగానే గౌతమ్ గంభీర్, ఆర్‌సీబీ అభిమానుల వైపు నోరు మూసుకోవాల్సిందిగా సైగ చేశాడు. ఇదే విరాట్‌కు ఆగ్రహం తెప్పించినట్లయింది. దీనికి ప్రతీకారంగానే నేటి మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకున్నాక అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు కోహ్లీ.

విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ ఇప్పటిది కాదు. 2013 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ఇద్దరి మధ్య వైరం అలానే కొనసాగుతూనే ఉంది.. అప్పట్లోనే గ్రౌండ్ లో స్ట్రిట్ ఫైట్ జరిగింది. అవకాశం వచ్చినప్పుడల్లా కోహ్లీని గంభీర్ విమర్శిస్తూనే ఉండగా.. కోహ్లీ మైదానంలో రివేంజ్ తీర్చుకునే పనిలో ఉంటున్నాడు.. ఏదీ ఏమైనా జెంటిల్మెన్ క్రీడకు ఇది ఏ మాత్రం మంచిది కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News