Virat Kohli: రిటైర్మెంట్ మాట దేవుడెరుగు.. 15 సెకన్లలో అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన విరాట్ కోహ్లీ!
Virat Kohli: విరాట్ కోహ్లీ తన అభిమానులకు కేవలం 15 సెకన్లలో ఎంతో పెద్ద శుభవార్తను అందించారు.
Virat Kohli: విరాట్ కోహ్లీ తన అభిమానులకు కేవలం 15 సెకన్లలో ఎంతో పెద్ద శుభవార్తను అందించారు. వారి మనసుల్లో ఎప్పటినుంచో మెదులుతున్న ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇకపై ఎలాంటి అనుమానాలు, ప్రశ్నలు ఉండవన్నమాట. ఇంతకీ విరాట్ కోహ్లీ ఏం చేశారు, ఏం చెప్పారు అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏమిటంటే, అది ఆయన రిటైర్మెంట్‌కు సంబంధించింది కాదు.. కానీ 2027 ప్రపంచ కప్‌లో ఆయన ఆడతారా లేదా అనే దాని గురించి. ఆ విషయంపై విరాట్ కోహ్లీ 15 సెకన్లలో చెప్పిన మాటలు అద్భుతం.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ భవిష్యత్తు మరియు 2027 ప్రపంచ కప్ వరకు ఆయన ఆడటం గురించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు కోహ్లీ తన ఉద్దేశాలను స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 15 సెకన్ల కంటే తక్కువ నిడివి గల వీడియోలో, తాను 2027 ప్రపంచ కప్‌లో ఆడటమే కాకుండా గెలవాలని కూడా కోరుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పారు.
విరాట్ కోహ్లీని ప్రస్తుత సమయంలో ఆయన తర్వాతి పెద్ద అడుగు ఏమిటని అడిగినప్పుడు, "నా తర్వాతి పెద్ద అడుగు ఏమిటో నాకు తెలియదు. కానీ బహుశా అది 2027 వన్డే ప్రపంచ కప్ గెలవడానికి ప్రయత్నించడం కావచ్చు" అని సమాధానమిచ్చారు. ఈ వీడియో ద్వారా విరాట్ కోహ్లీ ఇప్పుడప్పుడే రిటైర్ అయ్యే ఆలోచనలో లేరని స్పష్టమవుతోంది. ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నదంతా 2027 ప్రపంచ కప్‌లో ఆడడం, దానిని గెలవడం గురించే.
2027 ప్రపంచ కప్ గెలవాలని ఉవ్విళ్లూరుతున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నారు. ఎప్పటిలాగే ఆయన ఆర్సీబీ జట్టులో ఉన్నారు, ఈ జట్టు లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. విరాట్ కోహ్లీ ఆ రెండు మ్యాచ్‌లలో ఒక అర్ధ సెంచరీతో సహా 90 పరుగులు చేశారు.