సచిన్ రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు.

Update: 2020-01-13 12:09 GMT
Sachin Tendulkar and Virat Kohli File Photo

భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అందులోభాగంగా తొలి వన్డే ముంబై వేదిక కానుంది. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే సొంతగడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. అంతేకాదు అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డుని అందుకుంటాడు.

కాగా.. సొంతగడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల లిస్టులో సచిన్ టెండూల్కర్ 20 శతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రికార్డుకి ప్రస్తుత భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ దగ్గరలోఉన్నాడు. స్వదేశంలో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 19 సెంచరీలు చేశాడు . మరో శతకం సాధిస్తే సచిన్ సరసన నిలుస్తాడు.

మూడు వన్డేల సిరిస్ కోసం ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా భారతలో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే మైదానంలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ లో కోహ్లీ సెంచరీ చేస్తే సచిన్ సరసన నిలుస్తాడు. రెండు సెంచరీలు సాధిస్తే సచిన్ రికార్డు అధికమిస్తాడు.

శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 11వేల పరుగుల్ని పూర్తి చేసిన కెప్టెన్ గా రికార్డుకెక్కాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్ గువహటి వేదికగాజరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. రెండు టీ20ల్లో భారత్ విజయం 2-0తో సాధించింది.

కోహ్లీకంటే ముందు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని 11, 207 పైగా పరుగుల్ని సాధించాడు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి రికార్డు చూస్తే 169 మ్యాచ్‌ల్లో ఆడిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 11వేల పరుగుల్ని సాధించాడు. ఈ జాబితాలో స్టీఫెన్‌ ధోని(భారత్‌), కెప్టెన్‌గా ఫ్లెమింగ్‌(న్యూజిలాండ్‌) 303 మ్యాచ్‌ల్లో 11,561 పరుగులు , కెప్టెన్‌గా గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా) 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు, కెప్టెన్‌గా రికీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా) 324 మ్యాచ్‌లకు చేసి 15,440లు చేశాడు.

  

Tags:    

Similar News