Virat Kohli : కింగ్ కోహ్లీ ఓపెనర్‌గా దిగితే ఎలా ఉంటుంది? ఆ ఏడు మ్యాచ్‌ల్లో విరాట్ చేసిన రికార్డులివే
Virat Kohli : విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌ను 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా ప్రారంభించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే విరాట్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
Virat Kohli : కింగ్ కోహ్లీ ఓపెనర్‌గా దిగితే ఎలా ఉంటుంది? ఆ ఏడు మ్యాచ్‌ల్లో విరాట్ చేసిన రికార్డులివే
Virat Kohli : విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌ను 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా ప్రారంభించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే విరాట్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఆ సమయంలో గంభీర్, సచిన్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు అందుబాటులో లేకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ కోహ్లీకి ఈ బాధ్యతను అప్పగించింది. ఆ సిరీస్ మొత్తం విరాట్ ఓపెనర్‌గానే రాణించాడు.
ఓపెనర్‌గా ఆడిన నాలుగో వన్డేలోనే కోహ్లీ తన సత్తా చాటాడు. శ్రీలంకపైనే 54 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఓపెనింగ్ పొజిషన్‌లో ఇప్పటివరకు విరాట్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అనే పరుగుల యంత్రానికి పునాది పడింది ఆ ఓపెనింగ్ ఇన్నింగ్స్‌లతోనే. ఆ తర్వాత నెమ్మదిగా అతను తన శైలిని మార్చుకుని ప్రపంచ మేటి బ్యాటర్‌గా ఎదిగాడు.
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో మొత్తం 7 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేశాడు. ఈ 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 166 పరుగులు చేశాడు. ఇందులో అతని సగటు 23.71 కాగా, స్ట్రైక్ రేట్ 65.09 గా ఉంది. ఓపెనర్‌గా ఒక హాఫ్ సెంచరీ సాధించిన విరాట్, ఒక్కసారి కూడా సున్నాకి అవుట్ కాకపోవడం విశేషం. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతను మొత్తం 22 ఫోర్లు బాదాడు. అయితే నంబర్-3 లో కోహ్లీకి ఉన్న 58కి పైగా సగటుతో పోలిస్తే, ఓపెనర్‌గా అతని రికార్డులు కాస్త తక్కువగానే కనిపిస్తాయి.
ఓపెనర్‌గా కోహ్లీకి పరిమిత అవకాశాలు మాత్రమే దక్కాయి. ఆ తర్వాత సచిన్, సెహ్వాగ్ జట్టులోకి తిరిగి రావడంతో విరాట్ మిడిల్ ఆర్డర్‌కు మారాల్సి వచ్చింది. అయితే ఆ మార్పు కోహ్లీ కెరీర్‌నే మలుపు తిప్పింది. నంబర్-3 లో బ్యాటింగ్‌కు దిగడం ప్రారంభించిన తర్వాత విరాట్ నిలకడైన ఆటతీరుతో, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా అవతరించాడు. ప్రస్తుతం వన్డేల్లో 50కి పైగా సెంచరీలతో రికార్డు సృష్టించిన కోహ్లీ.. వన్డే క్రికెట్ చరిత్రలోనే గొప్ప నంబర్-3 బ్యాటర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు.