Usman Tariq: భారత్‌తో మ్యాచ్.. నా జన్మ ధన్యమైందంటూ పాక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్ ఆడటం ప్రతి క్రికెటర్ కల అని, తన కల ఈరోజు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు.
Usman Tariq: భారత్‌తో మ్యాచ్.. నా జన్మ ధన్యమైందంటూ పాక్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్ ఆడటం ప్రతి క్రికెటర్ కల అని, తన కల ఈరోజు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆడటం, అందులోనూ ప్రపంచకప్‌లో ఆడడం తనకు గొప్ప అనుభూతి అని తెలిపాడు. ఇలాంటి హైప్రెజర్ గేమ్‌లో భాగం కావడం తన కెరీర్‌లో ప్రత్యేక క్షణమని, తన జన్మ ధన్యమైందని తారిఖ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తారిఖ్ ఆడాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 24 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
ఉస్మాన్ తారిఖ్ మాట్లాడుతూ... 'ఈ వికెట్ చాలా స్లోగా ఉంది. నేను నెమ్మదిగా ఉండే పిచ్‌లపై చాలా మ్యాచ్‌లు ఆడాను. ఆ అనుభవం నాకు పనికొచ్చింది. టీమిండియాపై ఎక్కువ వికెట్లు తీయలేకపోయినా.. పరుగులు నియత్రించగలిగాను. భారత్ రన్‌రేట్‌ను నియంత్రించ గలిగినందుకు సంతోషంగా ఉంది. భారత్‌తో మ్యాచ్ ఆడటం ప్రతి క్రికెటర్ కల. నా కల ఈరోజు నెరవేరింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఆడటం, అందులోనూ ప్రపంచకప్‌లో ఆడడం నాకు గొప్ప అనుభూతి. ఈ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' అని చెప్పుకొచ్చాడు. తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్‌తో అందరికీ తెలిశాడు.
టీ20 ప్రపంచకప్ 2026 వేళ స్టార్ ప్లేయర్స్ కంటే ఎక్కువగా ఉస్మాన్ తారిఖ్ పేరు వినిపించింది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు కేవలం 4 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన తారిక్ పేరు ప్రముఖంగా వినపడడానికి కారణం అతడి బౌలింగ్ శైలి. ప్రపంచంలో బౌలింగ్ శైలి ఒక్కో బౌలర్‌ది ఒక్కోలా ఉంటుంది. మాజీలు లసిత్ మలింగ, కేశవ్ జాదవ్ సోహైల్ తన్వీర్.. ప్రస్తుత ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహీశా పతిరనలు భిన్నమైన శైలితో బౌలింగ్ చేయడం చూశాం. కానీ తారిక్ మాత్రం చాలా డిఫరెంట్. అతడు బౌలింగ్ చేసేందుకు క్రీజ్‌లోకి వచ్చాక.. ఓ క్షణం ఆగి బంతిని విసురుతాడు. బౌలింగ్ శైలిపై ఐసీసీ క్లీన్‌చిట్ ఇచ్చినా.. విమర్శలు మాత్రం ఆగడం లేదు. త్రో బౌలర్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్లేయర్స్ కూడా మైదానంలోనే అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇవేమీ పట్టించుకోని తారిక్.. ఏకంగా ప్రపంచకప్‌లోనే ఆడుతున్నాడు.