T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచుల్లో భారత్ జోరు
T20 World Cup: ఆసీస్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో గెలుపు
వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై టీమ్ ఇండియా గెలుపు (ఫైల్ ఇమేజ్)
T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జరుగుతున్న వార్మప్ మ్యాచుల్లో భారత్ అదరగొడుతోంది. ఫస్ట్ వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పై విజయం సాధించిన టీమిండియా.. కంగారులపైనా గెలిచి హౌరా అనిపించింది. దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఆ తర్వాత 153 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా వికెట్ కోల్పోయి టార్గెట్‌ను అలవోకగా అందుకుంది భారత్. ఓపెనర్ రోహిత్ శర్మ 60 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా క్రీజు నుంచి నిష్క్రమించాడు. ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు.