T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన అఫ్గానిస్థాన్‌

*బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుపు దాడి *స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో ఘన విజయం

Update: 2021-10-26 01:20 GMT

టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన అఫ్గానిస్థాన్‌(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ మెరుపు దాడి చేసింది. ఫలితంగా స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 10.2 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో జార్జ్ మున్సీ ఒక్కడే 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా విఫల కావడంతో స్కాట్లాండ్ ఘోర పరాజయం పాలైంది.

Tags:    

Similar News