T20 World Cup 2026: వాట్ ఏ ప్లాన్ సర్ జీ.. ఆ అస్రాన్ని భారత్‌పై ప్రయోగించనున్న పాకిస్థాన్!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026కు సమయం ఆసన్నమవుతోంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫ్రిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ జరగనుంది.

Update: 2026-01-31 08:55 GMT

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026కు సమయం ఆసన్నమవుతోంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫ్రిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ జరగనుంది. వరల్డ్‌కప్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్‌లో మరోసారి బౌలింగ్ యాక్షన్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ఫోకస్ మొత్తం యువ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ మీదే ఉంది. సోషల్ మీడియాలో అతడి బౌలింగ్ యాక్షన్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. తారిక్ బౌలింగ్ చకింగ్‌కు సమయం వచ్చేసింది అంటూ కొందరు మాజీ క్రికెటర్లు, అభిమానులు నెట్టింట ఆరోపణలు చేస్తున్నారు.

ఉస్మాన్ తారిక్ గతంలో ఒక మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. అయితే ఆ మ్యాచ్ తర్వాత అతడి బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే గత రెండు సిరీస్‌లలో పాకిస్థాన్ జట్టు అతడిని ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు. పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా తారిక్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోందని టాక్. టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో తారిక్‌ను నేరుగా ఆడించాలన్న ప్లాన్ పాక్ క్రికెట్ వర్గాల్లో ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వరల్డ్‌కప్‌కు ముందు అధికారికంగా యాక్షన్ టెస్టులు, నిషేధాల నుంచి తప్పించుకోవడానికే ఈ వ్యూహమని తెలుస్తోంది.

ఇదివరకే ఆడిస్తే ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ చర్యలు తీసుకునేదని, భారత్‌పై తమ అస్రాన్ని ప్రయోగించే అవకాశం లేకుండా పోతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బావించిందట. అందుకే తారిక్‌ను ఆడించకుండా.. పాక్ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తారిక్ పేరు ప్రస్తుతం ప్రతిభ కన్నా.. వివాదంతోనే ఎక్కువగా వినిపిస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ గతంలోనూ ఇలాంటి బౌలింగ్ యాక్షన్ కాంట్రవర్సీలను ఎదుర్కొంది. ఈసారి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, ఐసీసీ లేదా పీసీబీ నుంచి ఎలాంటి స్పష్టత వస్తుందో చూడాలి.

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో పాకిస్థాన్ పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే శ్రీలంకకు వెళ్లేందుకు పాక్ ఏర్పాట్లు చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈరోజు పూర్తిక్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటికే మెగా టోర్నీని బహిష్కారించిన విషయం తెలిసిందే. బంగ్లాకు మద్దతుగా తాము కూడా వరల్డ్‌కప్‌ను బహిష్కరిస్తామని పాక్ ప్రకటన చేయగా.. ఐసీసీ బ్యాన్ చేస్తామంటూ హెచ్చరించింది. దాంతో పాక్ తప్పక మెగా టోర్నీలో ఆడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News