T20 Worls Cup: గడువు 28 వరకే
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఇండియాలో నిర్వహించేది లేనిది తేల్చుకునేందుకు ఐసీసీ తుది గడువు విధించింది.
టీ 20 ప్రపంచ కప్ లోగో (ఫొటో ట్విట్టర్)
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఇండియాలో నిర్వహించేది లేనిది తేల్చుకునేందుకు ఐసీసీ తుది గడువు విధించింది. ఈనెల 28లోపు బీసీసీఐ తన నిర్ణయాన్ని వెల్లడించాలని ఐసీసీ స్పష్టం చేసింది. మంగళవారం జరిగిన ఐసీసీ బోర్డు వర్చువల్ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు.
కరోనా సెకండ్ వేవ్‌తో ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాలో వరల్డ్ టీ20 కప్ నిర్వహణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితులు జూన్ లో అనుకూలిస్తాయని, పొట్టి ప్రపంచ కప్‌ను ఇక్కడే నిర్ణయించాలి బీసీసీఐ పట్టుదలతో ఉంది. కాగా, నిర్ణయం తీసుకునేందుకు నెల రోజుల సమయం కావాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఐసీసీ బోర్డు అంగీకరించిందని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రపంచకప్ భారత్‌లో సాధ్యం కాకపోతే యూఏఈలో నిర్వహించేందుకు ఐసీసీ ప్లాన్ చేస్తుంది.