టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా సీనియర్ క్రికెటర్

Update: 2021-02-17 13:23 GMT

డుప్లెసిస్ ఫైల్ ఫోటో 

సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్‌ డు ప్లెసిస్‌ టెస్టు క్రికెట్కు గుడ్‌బై చెప్పాడు. ఈమేరకు అతను అధికారికంగా ప్రకటించాడు. వన్డేలు, టీ20లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డు ప్లెసిస్ వెల్లడించాడు. రిటైర్మెంట్ పై స్పందించిన 36ఏళ్ల డుప్లెసిస్.. దేశం తరపున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వచ్చే రెండేళ్లలో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ పై దృష్టి సారిస్తున్న అని వెల్లడించాడు.

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 2012లో అరంగేట్రం చేసిన డు ప్లెసిస్‌ దక్షిణాఫ్రికాపై 69 టెస్టు మ్యాచ్‌ల్లో 40 సగటుతో 4,163 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 21 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకు అన్ని ఫార్మాట్లలో డు ప్లెసిస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు 36 టెస్టుల్లో 18 విజయాలు, 39 వన్డేల్లో 28 విజయాలు, 40 టీ20ల్లో 25 మ్యాచుల్లో గెలిచింది.

Tags:    

Similar News