బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదా..?

భారత క్రికెట్ జట్లు మాజీ సారథి సౌరవ్ గంగూలీకి మరో కీలక పదవి చేపట్టనున్నారు. ప్రస్తుతం గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనను బీసీసీఐకీ కొత్త అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

Update: 2019-10-14 05:50 GMT

భారత క్రికెట్ జట్లు మాజీ సారథి సౌరవ్ గంగూలీకి మరో కీలక పదవి చేపట్టనున్నారు. ప్రస్తుతం గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనను బీసీసీఐకీ కొత్త అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీకే ఖన్నా పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఈనెల 23న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి నోటీఫికేషన్ వెలువడింది. కాగా.. నేటి( అక్టోబర్ 14)తో నామినేషన్లకు తెర పడనుంది. అక్టోబర్ 23న ఎన్నికల జరగాల్సి ఉంది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం కూడా ఈ నెల 23 నిర్వహించనుంది. పలు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది క్రికెట్ అసోసియేషన్స్ పై వేటు పడింది. ఈ సమావేశానికి బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ నుంచి గంగూలీ ప్రాతినిధ్యం వహించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ నుంచి మహ్మద్ అజహరుద్ధీన్, ఢీల్లీ నుంచి రజత్ శర్మ హాజరవుతారు.

భారత్ జట్టుకు గంగూలీ సేవలందించారు. 2003 ప్రపంచ కప్ లో గంగూలీ భారత్ జట్లును ప్రపంచ కప్ పైనల్స్ వరకు తీసుకెళ్లారు. ఆ సిరీస్ లో అతడు రాణించాడు. గంగూలీ గురువు దాల్మీయా గతంలో బీసీసీఐ అధ్యక్షుడుగా చేశారు. ఈ నెల 23 జరిగే ఎన్నికల్లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపింస్తుంది. ఇదీలా ఉంటే బ్రజేశ్ పటేల్ ఐపీఎల్ చైర్మన్ పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.

Tags:    

Similar News