IND vs SA: దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్.. భారత్ ముందు భారీ లక్ష్యం!
IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.
IND vs SA: దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచ్.. భారత్ ముందు భారీ లక్ష్యం!
IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి సఫారీలు 187 పరుగులు చేశారు. దాంతో టీమిండియా టార్గెట్ 188గా ఉంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హిట్టర్ డేవిడ్ మిల్లర్ (63) హాఫ్ సెంచరీ బాదాడు. స్టార్ బ్యాటర్స్ డేవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ (44) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్స్ పడగొట్టారు. ఇక శివమ్ దూబె, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. సఫారీలకు మంచి ఆరంభం దక్కలేదు. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (4), ఓపెనర్ క్వింటన్ డికాక్ (6), స్టార్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ (7) విఫలమయ్యారు. భారత బౌలర్ల దెబ్బకు 20 పరుగులకే మూడు వికెట్స్ కోల్పోయిన దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్, డేవాల్డ్ బ్రెవిస్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. బౌండరీల మోత మోగిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో సఫారీల రన్ రేట్ 10కి తగ్గలేదు. ఇద్దరు చెలరేగుతుండడంతో దక్షిణాఫ్రికా 200 స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు.
డేవాల్డ్ బ్రెవిస్ అవుట్ అయినా.. డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడాడు. మిల్లర్, మార్కో జాన్సెస్ పెవిలియన్ చేరడంతో స్కోర్ బోర్డు వేగం కాస్త తగ్గింది.బుమ్రా, అర్షదీప్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ తక్కువ స్కోరుకే దక్షిణాఫ్రికాను కట్టడి చేస్తుందని అనుకున్నారు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్య 20 రన్స్ ఇవ్వడంతో సఫారీలు భారీ స్కోర్ చేసింది. చివరి ఓవర్లో రెండు భారీ సిక్సులు సహా 20 పరుగులు రావడంతో మ్యాచ్ మోమెంటం పూర్తిగా సౌతాఫ్రికా వైపు తిరిగింది. ఈ ఓవర్ సఫారి జట్టుకు కీలక బూస్ట్ ఇచ్చింది. భారత్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందో లేదో చూడాలి.