Breaking News: టీమిండియాకు షాక్ ఇచ్చిన సౌతాఫ్రికా.. భారీగా ఓడిన భారత్..
టీ20 వరల్డ్ కప్ తన తొలి సూపర్8 మ్యాచ్ లో టీమిండియా సౌతాఫ్రికాపై ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ కు తొలిషాక్ తగిలింది. టోర్నీ హాట్ ఫేవరేట్ గా.. గ్రూప్ మ్యాచుల్లో టాపర్ గా సూపర్ 8 కు చేరిన భారత్ తన మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఓటమి చవి చూసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీలు 187 పరుగుల భారీ స్కోర్ చేసింది 188 పరుగు ల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చి.. చివరకు 111nపరుగుల వద్ద తన పోరాటాన్ని ముగించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు భారీ తేడాతో ౭౬ విజయం సాధించి సూపర్8లో తన తోలి మ్యాచ్ ను గెలుచుకుంది.
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మూడో సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఆ జట్టు ఓడిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్రికన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. దానికి సమాధానంగా, భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. మార్కో జాన్సెన్ 4 వికెట్లు, కేశవ్ మహారాజ్ 3 వికెట్లు, కార్బిన్ బాష్ 2 వికెట్లు, ఐడెన్ మార్క్రామ్ 1 వికెట్ పడగొట్టారు. శివం దుబే 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తరఫున డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేయగా, డెవాల్డ్ బ్రెవిస్ 45 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 24 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.