ENG vs PAK: ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌కు షాక్
ENG vs PAK: రేపు ఆస్ట్రేలియాతో తలపడనున్న సౌతాఫ్రికా
ENG vs PAK: ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌కు షాక్
ENG vs PAK: ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌కు షాక్ ఇస్తూ తుది పోరుకు దూసుకెళ్లింది సౌతాఫ్రికా దీంతో ఫైనల్‌లో సాతాఫ్రికా టీమ్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఈనెల 26న జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌తో తలపడనుంది.
ఈ సెమీస్మ్యాచ్లో 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి పరాజయం చెందింది. అయితే ఒక దశలో ఇంగ్లాండ్సూనాయసంగా గెలుపొందుతుందని అభిమానులు ఆశించారు. కానీ కీలక సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్లు దూకుడు ప్రదర్శించడంతో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు.
ఇంగ్లాండ్ ఓపెనర్లు డానిల్లె వ్యాట్, సోఫియా డంక్లే.. తొలి వికెట్‌కు 53 పరుగులు నమోదు చేశారు. ధాటిగా ఆడిన డంక్లే ఆరు ఫోర్లతో 28 రన్స్ చేసింది. వ్యాట్ కూడా ఆరు బౌండరీలతో 34 పరుగులు చేసింది. అలానే షివర్ 5 ఫోర్లతో 40 రన్స్, కెప్టెన్ హీథర్ నైట్ రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించింది. వీరిద్దరూ ఔటైన తర్వాతే ఇంగ్లాండ్‌కు అసలు కష్టం మొదలైంది. వరుసగా వికెట్లను కోల్పోయింది. చివరికి లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.