Pakistan's Chief Selector : పాకిస్తాన్‌ చీఫ్‌ సెలక్టర్‌ గా షోయబ్ అక్తర్ ?

Pakistan’s Chief Selector : పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ నియామకం అయినట్లుగా తెలుస్తోంది..

Update: 2020-09-11 11:03 GMT

shoaib akhtar

Pakistan's Chief Selector : పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ నియామకం అయినట్లుగా తెలుస్తోంది.. ఈ విషయాన్నీ షోయబ్ అక్తర్ స్వయంగా వెల్లడించాడు.. ఇదే విషయంపై పీసీబీతో చర్చలు జరిపినట్లుగా అక్తర్ వెల్లడించాడు.. ప్రస్తుతం పాక్ జట్టుకు ప్రధాన కోచ్ గా, చీఫ్ సెలక్టర్ గా ఆ దేశ మాజీ ఆటగాడు మిస్బావుల్‌ హక్‌ కొనసాగుతున్నాడు. అయితే జట్టు పేలవమైన ప్రదర్శన చూపడంతో చీఫ్ సెలెక్టర్ బాధ్యతలను అక్తర్ కి ఇవ్వనున్నట్లుగా పీసీబీ నిర్ణయం తీసుకుంది. కేవలం హెడ్ కోచ్ గా మాత్రమే మిస్బావుల్‌ హక్‌ ని కొనసాగించనున్నారు.. భారత క్రికెట్‌లో మాదిరిగానే స్వదేశీ కోచ్‌లు, కోచింగ్‌ సహాయ సిబ్బందిని పాక్‌ నియమించుకున్నది. 

ఇక ఇదే అంశంపైన అక్తర్ మాట్లాడుతూ.. " పీసీబీ బోర్డుతో జరిగిన చర్చలు వాస్తవం.. కానీ ఇంకా ఏమీ నిర్ణయం కాలేదు.  త్వరలోనే చర్చల పైన క్లారిటీ రానుంది.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ప్రధాన పాత్ర పోషించడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను..నేను ఇతరులకు సలహా ఇవ్వడానికి భయపడను. నాకు అవకాశం వస్తే పాకిస్తాన్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేస్తానని క్రికెట్‌ బాజ్‌ నిర్వహించిన యూట్యూబ్‌ కార్యక‍్రమంలో అక్తర్‌ ఈ విషయాలను వెల్లడించాడు..

ఇక షోయబ్ క్రికెట్ కెరీర్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా వివాదలతోనే వార్తల్లో నిలుస్తూ వచ్చాడు షోయబ్.. మొత్తం 46 టెస్టులలో 25.69 సగటుతో 178 వికెట్లను సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణకి వస్తే 11 పరుగులకు 6 వికెట్లు తీశాడు. ఇక వన్డేలలో 138 మ్యాచ్‌లు ఆడి 23.20 సగటుతో 219 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణలో 16 పరుగులకు 6 వికెట్లు తీశాడు..

Tags:    

Similar News