T20 World Cup 2026: భారత్ అప్‌డేటెడ్ షెడ్యూల్.. కీలక మ్యాచ్‌లకు టైమ్ ఫిక్స్!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ మొదలవనుంది. మెగా టోర్నీకి డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియా సిద్ధమవుతోంది.

Update: 2026-02-03 05:08 GMT

T20 World Cup 2026: భారత్ అప్‌డేటెడ్ షెడ్యూల్.. కీలక మ్యాచ్‌లకు టైమ్ ఫిక్స్!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి టోర్నీ మొదలవనుంది. మెగా టోర్నీకి డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియా సిద్ధమవుతోంది. ఈమొదటి రోజు ముంబైలో అమెరికాతో సూర్య సేన తలపడనుంది. ఇప్పటికే భారత జట్టులోని కొందరు ముంబై చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో భారత జట్టు తాజా అప్‌డేటెడ్ షెడ్యూల్ వెలువడింది. వార్మ్‌అప్ మ్యాచ్‌ల నుంచి గ్రూప్ స్టేజ్ వరకు భారత్ ఆడే మ్యాచ్‌ల తేదీలను ఓసారి పరిశీలిద్దాం.

మెగా టోర్నీకి ముందు భారత్ మూడు వార్మ్‌అప్ మ్యాచ్‌లు ఆడనుంది. సోమవారం (ఫిబ్రవరి 2) యూఎస్‌ఏతో జరిగిన వార్మ్‌అప్ మ్యాచ్ ఇప్పటికే పూర్తైంది. ఇందులో భారత్ గెలిచింది. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 6న నమీబియాతో భారత్ వార్మ్‌అప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా ఆటగాళ్ల ఫామ్, కాంబినేషన్లను టీమిండియా మేనేజ్‌మెంట్ పరీక్షించనుంది. అసలు టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తన తొలి గ్రూప్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న యూఎస్‌ఏను ఎదుర్కొననుంది. అనంతరం ఫిబ్రవరి 12న నమీబియాతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. భారత్‌కు సూపర్ 8 అవకాశాలు మెరుగవుతాయి.

ఫిబ్రవరి 15న దాయాది పాకిస్థాన్ జట్టుతో టీమిండియా మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే భారత్ మ్యాచ్‌ను పాక్ బహిష్కరించింది. దీనిపై పీసీబీ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. పాక్ ప్రభుత్వమే టీమిండియా మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నాం అని ప్రకటించింది. పీసీబీ అధికారికంగా ప్రకటిస్తే.. భారత్‌కు 2 ఫ్రీ పాయింట్లు దక్కనున్నట్లు సమాచారం. ఇది గ్రూప్ సమీకరణాల్లో టీమిండియాకు పెద్ద ప్లస్‌గా మారనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో టీమిండియా తన తదుపరి మ్యాచ్ ఆడనుంది.

మొత్తంగా చూస్తే.. వార్మ్‌అప్ మ్యాచ్‌లతో పాటు గ్రూప్ స్టేజ్‌లో కూడా భారత్‌కు మంచి బ్యాలెన్స్‌డ్ షెడ్యూల్ లభించింది. కీలక మ్యాచ్‌ల మధ్య తగినంత విశ్రాంతి దొరకడం, ఫ్రీ పాయింట్ల లాభం ఉండడం వల్ల టీమిండియా టోర్నీని బలంగా ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పైనే ఉత్కంఠ ఉన్నా.. ఫిబ్రవరి 7న జరిగే తొలి మ్యాచ్‌పైనే సూర్య సేన దృష్టి పెట్టింది. భారత్ సునాయాసంగా సెమీస్ చేరుతుందని మాజీలు అంచనా వేస్తున్నారు. ఫైనల్ కూడా చేరుకుంటుందని మరికొందరు అంటున్నారు.

Tags:    

Similar News