రీఎంట్రీలో సానియా సంచలనం

భారత టెన్నెస్ స్టార్ సానియా మీర్జా పునరాగమనం తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో సంచలనం సృష్టించింది.

Update: 2020-01-17 06:29 GMT

భారత టెన్నెస్ స్టార్ సానియా మీర్జా పునరాగమనం తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో సంచలనం సృష్టించింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో మహిళల డబుల్స్‌లో సెమీఫైన్ లో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకుపోయింది. ఉమెన్ డబుల్స్ లో తన భాగస్వామి కిచెనోక్ (ఉక్రెయిన్) కలిసి ఈ టోర్నమెంట్ లో ఆడింది. సెమీస్ లో ఈ జంట 7-6, 6-2 తేడాతో మేరీ బౌజ్ కోవా( చెక్ రిపబ్లిక్), జిదన్ సెక్ (స్లొవేకియా) ను మట్టికరిపించింది. ఫైనల్ పోరులో చైనా ద్వయం షువై పెంగ్, షువై ఝాంగ్ తో తలపడనుంది.

ఇక రెండు గంటల పాటు సాగిన సెమీస్ పోరు తొలి సెట్ హోరాహోరిగా సాగింది.  రెండు జంటలు 6-6తో నిలవడం మొదట టై బ్రేక్ కారణమైంది. రెండో సెట్ లో ప్రత్యర్థుల జోడి బౌజ్ కోవా( చెక్ రిపబ్లిక్), జిదన్ సెక్ (స్లొవేకియా) పోటీ కూడా ఇవ్వలేకపోయారు. బిడ్డకు జన్మనించేందుకు సానియా మీర్జా రెండేళ్లు టెన్ని్స్ దూరంగా ఉన్నారు. సానియా 2017 అక్టోబర్ లో చివరిసారి చైనా ఓపెన్ లో ఆడింది. ఆ తర్వాత ఫిటెనెస్ మెరుగుపరుచుకొని హోబర్ట్ టెన్నిస్ టోర్నమెంట్ లో పునరాగమనం చేసింది.


 

 

Tags:    

Similar News