యూఎస్ ఓపెన్ నుంచి త‌ప్పుకున్న సానియా మీర్జా..

Sania Mirza: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయపడింది.

Update: 2022-08-23 14:05 GMT

యూఎస్ ఓపెన్ నుంచి త‌ప్పుకున్న సానియా మీర్జా.. 

Sania Mirza: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. తన మోచేతికి గాయమైందని అందులో పేర్కొంది. అయితే గాయం కారణంగా US ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్టు చెప్పింది. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నపుడు ఆమె మోచేతికి గాయమైంది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైనదో తనకు తెలియలేదని వెల్లడించింది.

మోచేతి దగ్గర లిగమెంట్ కాస్త దెబ్బతిన్నదని వివరించింది. కొన్ని వారాలపాటు ఆటకు దూరంగా ఉండబోతున్నానని తెలిపింది. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ ప్లాన్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తానని పేర్కొంది. దీంతో తన ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. సానియా త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.



 


Tags:    

Similar News