Sania Mirza: షోయబ్ మాలిక్‌కు శుభాకాంక్షలు తెలిపిన సానియా మీర్జా ఫ్యామిలీ.. విడాకులపై కీలక ప్రకటన..
Sania Mirza: పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు.
Sania Mirza: షోయబ్ మాలిక్‌కు శుభాకాంక్షలు తెలిపిన సానియా మీర్జా ఫ్యామిలీ.. విడాకులపై కీలక ప్రకటన..
Sania Mirza: పాకిస్తాన్ క్రికెటర్, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ విషయంపై సానియా కుటుంబం తాజాగా స్పందించింది. ఈ మేరకు సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.
సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె స్పందించక తప్పట్లేదు. షోయబ్, ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్‌కు తన న్యూ జర్నీ కోసం ఆమె శుభాకాంక్షలు తెలిపింది. ఇక అనవసర చర్చలు ఆపేయండి.
ఆమె తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఆమెకు అండగా నిలవాలి. తన గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలని" ఓ ప్రకటనలో పేర్కొన్నారు.