ఇదే సరైన నిర్ణయం.. సిరీస్ రద్దుపై స్పందించిన సచిన్

కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌లో రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. ఈ మహహ్మరి భయం ప్రజలను పట్టిపీడిస్తోంది.

Update: 2020-03-14 10:53 GMT
Sachin Tendulkar (File Photo)

కరోనా వైరస్ (కొవిడ్‌-19) భారత్‌లో రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. ఈ మహహ్మరి భయం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా 5వేల మంది మరణించారు. మన దేశంలో కోవిడ్ వల్ల ఇద్దరు మరణించారు. కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపింది. క్రీడారంగంపై కూడా ప్రభావం చూపింది. ఒక ఐపీఎల్ సహా అన్ని అంతర్జాతీయా మ్యాచులపై దీని ప్రభావం పడింది.

కాగా.. అందులో భాగంగా కరోనా విస్తరిస్తుండటంతో రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌'ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. సిరీస్‌ రద్దు అనంతరం క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ , బ్రయాన్‌ లారాలు నిరాశ వ్యక్త పరిచారు. అయితే ఆటగాళ్లు, ప్రేక్షకుల శ్రేయస్సు కోసం సరైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ అదుపులోకి రావాలని ప్రార్థిస్తున్నామని సచిన్ తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సచిన్‌‌, వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండ్స్‌ ఆటను చూడాని అభిమానులు కోరుకుంటున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చిన మిగిలిన మ్యాచ్‌లను ఆడాలని ఎదురుచూస్తున్నాం అని లారా అన్నారు. సచిన్‌ ఆటను ప్రజలు ఆస్వాదించడం ఎంతో బాగుంది అని లారా చెప్పారు. సిరీస్‌ను రద్దు చేయడం బాధ కలిగించిందని శ్రీలంక మాజీ క్రికెటర్ రోమేష్ కలువితరణ అన్నారు. కరోనా పంజా విసురుతుండడంతో ఈ టోర్నీలో మ్యాచులు రద్దు చేశారు. ఇక ఈ టోర్నీలో ఐదు జట్టు శ్రీలంక, వెస్టిండీస్‌ , దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జట్లు ఆడుతున్నాయి.

 

Tags:    

Similar News