Ishan Kishan Record: ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. యువరాజ్, గంభీర్ రికార్డులు బ్రేక్!

Ishan Kishan Record: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌పైతో జరిగిన మ్యాచ్‌లో కిషన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో అతడి ఖాతాలో ఈ రికార్డు చేరింది.

Update: 2026-02-15 15:06 GMT

Ishan Kishan Record: ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. యువరాజ్, గంభీర్ రికార్డులు బ్రేక్!

Ishan Kishan Record: టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌పైతో జరిగిన మ్యాచ్‌లో కిషన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో అతడి ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ ఉన్నాడు. 2012లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో హఫీజ్ కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.

రెండో స్థానంలో భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఉన్నాడు. అభిషేక్ 2025లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఇక నాలుగో స్థానంలో భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. యువీ 2012లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఈ గణాంకాలు చూస్తే ఇండియా–పాక్ మ్యాచ్‌లలో బ్యాటర్లు ఎంత దూకుడుగా ఆడతారో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో వేగంగా పరుగులు చేయగలిగిన ఆటగాళ్లే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తారు. తాజా ప్రదర్శనతో ఇషాన్ కిషన్ కూడా అలాంటి మ్యాచ్ విన్నర్ల జాబితాలో తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఇక భారత్, పాకిస్థాన్‌ టీ20ల్లో బ్యాటర్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో కూడా ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. ఈ రైవల్రీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల జాబితాలో ఇప్పటికీ అగ్రస్థానంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 2022లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రెండో స్థానంలో పాకిస్థాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. 2021లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు చేశాడు. ఇక మూడో స్థానంలో కూడా కోహ్లీనే ఉన్నాడు. కింగ్ 2012లో ప్రస్తుతం జరుగుతున్న ప్రేమదాస స్టేడియంలో 78 పరుగులు సాధించాడు. అదే కొలొంబోలో ఇప్పటి మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ 77 పరుగులు చేసి నాలుగో స్థానానికి చేరాడు. ఐదో స్థానంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. 2007లో జోహన్నెస్‌బర్గ్లో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు.

Tags:    

Similar News