Abhishek Sharma: నీకన్నా సంజు శాంసనే బెటర్.. అభిషేక్ శర్మపై ఫాన్స్ ఫైర్!
Abhishek Sharma: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది.
Abhishek Sharma: నీకన్నా సంజు శాంసనే బెటర్.. అభిషేక్ శర్మపై ఫాన్స్ ఫైర్!
Abhishek Sharma: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. దాయాది పాకిస్థాన్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. స్పిన్నర్ సల్మాన్ అఘా బౌలింగ్‌లో మొదటి ఓవర్ చివరి బంతికి షాట్‌కు యత్నించిన అభిషేక్.. మిడాన్‌లో షహీన్ ఆఫ్రిదికి తేలికైన క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ ఒక్క పరుగుకే తొలి వికెట్‌ను కోల్పోయింది.
పాకిస్థాన్‌పై మాత్రమే కాదు.. టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ ఆడిన మొదటి మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. 12న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో కడుపు నొప్పి కారణంగా అభిషేక్ ఆడలేదు. కీలక పాక్ మ్యాచ్‌లో అతడిని ఆడించాలని టీం మేనేజ్‌మెంట్ చూసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన అభిషేక్.. పాకిస్థాన్‌పై కూడా డకౌట్ అయ్యాడు. నమీబియాపై ఆడిన సంజు శాంసన్ 8 బంతుల్లోనే 22 రన్స్ చేశాడు. రెండు మ్యాచ్‌లలో విఫలమైన అభిషేక్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. 'నీకన్నా సంజు శాంసనే బెటర్ అయ్యా', 'ఆశలు ఆవిరి చేశావ్ అభిషేక్', 'అంతన్నారు, ఇంతన్నారు.. చివరకి గుడ్డు సున్నాలు పెడుతున్నారు' అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అభిషేక్ పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
అభిషేక్ శర్మ చివరి ఆరు టీ20 ఇన్నింగ్స్ గణాంకాలు చూస్తే.. స్థిరత్వం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఇన్నింగ్స్ స్కోర్లు వరుసగా 0(1), 68 నాటౌట్(20), 0(1), 30(16), 0(1), 0(4) ఉన్నాయి. ఈ గణాంకాల్లో ఒక వైపు అతని పేలవమైన ఆరంభాలు కనిపిస్తే, మరోవైపు కేవలం 20 బంతుల్లో 68 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ అభిషేక్ సామర్థ్యాన్ని చాటుతోంది. అంటే అతను భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉన్నప్పటికీ.. స్థిరంగా రన్స్ చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు డకౌట్ కావడం టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన కలిగించే అంశం. ఓపెనర్‌గా జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నందున అతడు ప్రదర్శనపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యువ ఆటగాళ్లలో ఇలాంటి ఒడిదుడుకులు సాధారణమే. ఒక భారీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తారుమారు చేసే టాలెంట్ ఉన్నందున.. అభిషేక్‌కు అవకాశాలు కొనసాగితే స్థిరమైన ప్రదర్శన ఇవ్వగలడని నిపుణులు అంటున్నారు.