IND vs PAK Playing 11: టాస్ గెలిచిన పాకిస్థాన్.. రెండు మార్పులతో బరిలోకి భారత్, తుది జట్లు ఇవే!
IND vs PAK Playing 11: మరికాసేపట్లో టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు.
IND vs PAK Playing 11: మరికాసేపట్లో టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. పాక్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. భారత్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ సూర్యకుమారి యాదవ్ చెప్పాడు. సంజు శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయనున్నాడు. పేసర్ అర్షదీప్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్లు సూర్య చెప్పాడు.
వర్షం వల్ల మ్యాచ్‌కు ఏమైనా అంతరాయం ఏర్పడుతుందా? అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం ఉండదని కొలంబో వాతావరణ శాఖ చెప్పింది. మ్యాచ్ ప్రారంభమయ్యేసరికి ఎలాంటి వర్షం ఉండదని.. పూర్తిగా జరిగే అవకాశాలే ఎక్కువని చెప్పింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ 2025లో మాదిరిగానే టీ20 ప్రపంచ కప్‌లో కూడా భారత్, పాక్ ఆటగాళ్లు కరచాలనం చేసుకోలేదు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మట్లాడుతూ.. ‘24 గంటలు వెయిట్ చేయండి’ అని చెప్పిన సంగతి తెలిసిందే. టాస్ సమయంలో కాస్త దూరంగానే కెప్టెన్లు సూర్యకుమార్, సల్మాన్ అఘా ఉన్నారు.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్: సయామ్ ఆయుబ్, సాహిబ్జాద ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ అజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.