Road Safety Series: లంకేయులకు చుక్కలు చూపిస్తున్న బ్రియాన్ లారా

Road Safety World Series: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ (2020-2021)లో భాగంగా రాయ్‌పుర్‌లో వేదికగా (శనివారం) మరో ఆసక్తికర పోరు తెరలేచింది.

Update: 2021-03-06 14:49 GMT

Road Safety World Series 

Road Safety World Series: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్(2020-2021)లో భాగంగా రాయ్‌పుర్‌లో వేదికగా (శనివారం) మరో ఆసక్తికర పోరు జరుగుతుంది. నేడు వెస్టిండీస్ లెజెండ్స్ తో శ్రీలంక లెజెండ్స్ తలపడనుంది. విండీస్ జట్టుకు దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా నాయకత్వం వహించనున్నాడు. మరో వైపు శ్రీలంక లెజెండ్స్ జట్టుకు కెప్టెన్ గా తిలకరత్నే దిల్షాన్ వ్యవహరించనున్నాడు. దిగ్గజ జట్ల మధ్యపోరు శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది.

ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక లెజెండ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన లారా జట్టు ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు విలియమ్(19),  నర్సింగ్ నరేన్ (3) రనౌట్ల రూపంతో వెనుదిరిగారు. ఇక మరో వికెట్ కోల్పోకుండా కెప్టెన్ లారా(39),స్మీత్ (49) పరుగులతో క్రీజులో ఉన్నారు. విండీస్ జట్టు 13ఓవర్లతో రెండు వికెట్ల నష్టానికి 109పరుగులు చేసింది

ఇక ఈ సిరీస్ లో ప్రతి జట్టు 5 మ్యాచులు ఆడనుంది. ఈ టోర్నీ గతేడాదే కార్యరూపం దాల్చింది. అయితే కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులోకి రావడంతో ఈ టోర్నీ మళ్లీ పట్టాలెకింది. ఈ టోర్నీ మార్చి 21 వరకు జరగనుంది. ఇప్పటికే భారత్ లెజెండ్స్ మూడు మ్యాచులు ఆడగా.. శ్రీలంక రెండు, వెస్టిండీస్ లెజెండ్స్ రెండు, బంగ్లా, ఆస్ట్రేలియా ఒక్కొక్కటి చొప్పున మ్యాచులు ఆడాయి. శ్రీలంక లెజెండ్ప్ విషయానికి వస్తే సినియర్ ప్లేయర్ సనత్ జయసూర్య, ముత్తయమరళీథరుణ్, చమర సిల్వా, మెండీస్, హెరత్, తరంగ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ఇక విండీస్ విషయానికి వస్తే లారా, జాకబ్స్ , స్మిత్, కారల్ హోపర్ వంటి పేయర్లు ఉన్నారు.

ఈ సిరీస్ లో టీమిండియా లెజెండ్స్ ఈ నెల తొమ్మిదో తేదీనా ఇంగ్లాండ్ లెజెండ్స్ తో తలపడనుంది. మార్చి 13న సౌతాఫ్రికా లెజెండ్స్ లో తలపడనుంది. శుక్రవారం భారత్ లెజెండ్స్, బంగ్లా లెజెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా దిగ్గజ జట్టు విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో భారత్ లెజెండ్స్ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక 2, సౌతాఫ్రికా లెజెండ్స్ 2 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

గత మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 35 బంతుల్లో (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు‌) సచిన్‌ టెండూల్కర్‌ (33 నాటౌట్‌; 5 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో బంగ్లాదేశ్‌ చిత్తుచిత్తుగా ఓడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. వినయ్‌కుమార్‌ (2/25), ప్రజ్ఞాన్ ఓజా (2/12), యువరాజ్‌ సింగ్ (2/15) కీలక వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదన ఆరంభించిన ఇండియా లెజెండ్స్ జట్టు 10.1 ఓవర్లోనే ముగించింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన వినయ్‌కుమార్ ఈ మ్యాచ్ లో ఇరగదీశాడు. 


Tags:    

Similar News