Road Safety World Series: ఆపితేనే సేఫ్టీ.. లెజెండ్స్ లీగ్ బ్రేక్?
కరోనావైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. ఈ కోవీడ్ 19 కారణంగా క్రీడారంగం సైతం కుదేలవుతోంది. దీని ప్రభావం లెజెండ్స్ సిరీస్ పైనా పడింది.
కరోనావైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని గడగడలాడుతున్నాయి. ఈ కోవీడ్ 19 కారణంగా క్రీడారంగం సైతం కుదేలవుతోంది. దీని ప్రభావం లెజెండ్స్ సిరీస్ పైనా పడింది. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు, రాజకీయ నేతలకు సైతం కరోనా సోకడంతో అన్ని కార్యక్రమాలూ రద్దవుతున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ మాజీ దిగ్గజ క్రికెటర్ల టీ20 సిరీస్ ఏర్పాటు చేశారు. అయితే కరోనా కారణంగా ఈ సిరీస్ కూడా నిరవధికంగా వాయిదా పడింది. ముంబై వేదిక సచిన్, లారా, షాన్ లీ, దిల్షాన్, తదితర మాజీ క్రికెటర్లతో జరుతున్న ఈ టోర్నీ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు జరగాయి. కరోనా నేపథ్యంలో ఫైనల్ సహా 7 మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా పుణెలోని ఎమ్‌సీఏ స్టేడియంలో జరపాలని మొదట భావించారు. కానీ ప్రజలు, క్రీకెటర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని లీగ్‌ను తాత్కలికంగా రద్దు చేయడానికి నిర్వాహకులు ఒప్పుకున్నారని పరిస్థితులు మెరుగైన తర్వాత ఈ లెజెండ్స్ లీగ్ నిర్వహింస్తారని సమాచారం.
ఈ సిరీస్ ఇప్పటికే జరిగిన మ్చాచ్ లు మంచి విజయం సాధించాయి. కరోనా భయాన్ని లెక్కచెయకుండా అలానాటి ఆటగాళ్ల వీక్షించేందుకు అభిమానులు మైదానాలకు తరలివచ్చారు. ముంబై వేదికగా జరిగిన అన్ని మ్యాచ్‌లకు ఊహించని రెస్పాన్స్ వచింది. లేటు వయసులో కూడా లారా, సచిన్, సెహ్వగ్ బౌండరీల మోత మోగించడం.. జహీర్, మునాఫ్, వాస్ వంటి దిగ్గజాలు కళ్లు చెదిరే బంతులతో వికెట్లు పడగొట్టడం.. అభిమానులకు కావాల్సిన మాజానిచ్చింది.
కరోనా ప్రభావం దేశంలో వేగంగా పెరిగిపోతుంది. దీని బరిన పడిన వారి కేసులు 75 నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. క్రీడలను నిర్వహించిన, ప్రేక్షకులను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఏ క్రీడను అడ్డుకోం. ప్రేక్షకుల్లేకుండా పోటీలను నిర్వహించుకోవచ్చు అని క్రీడాశాఖ వెల్లడించింది. మరోవైపు మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించి టికెట్ల అనుమతి నిరాకరిచింది. దీంతో వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్ ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని ప్రయత్నించారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పోటీలు వాయిదా పడుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్‌లో పొట్టి క్రికెట్ పండగ ఐపీఎల్ సైతం వాయిదా పడింది. తమ రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహించబోమని ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఐపీఎల్-2020ని వాయిదా వేసింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.