India's Richest Cricketer: వామ్మో.. పుడితే క్రికెటర్ ఇంట్లో పుట్టాలి.. టాప్ -5 రిచ్ ప్లేయర్స్ వీళ్ళే
India's Richest Cricketer: ప్రపంచం వ్యాప్తంగా క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు. చాలా మంది క్రికెట్ మ్యాచులు ఉన్నాయంటే చాలు ఆఫీసులు, కాలేజీలుకు డుమ్మాలు కొట్టి మరీ టీవీల ముందు అతుక్కుపోతుంటారు. తమ అభిమాన జట్టుకు మద్దతు పలుకుతుంటారు. అయితే తమ అభిమాన క్రికెటర్ మైదానంలోకి అడుగుపెడితే చాలు ఈలలు, చప్పట్లతో హోరెత్తిస్తుంటారు. అయితే మన క్రికెటర్లు కూడా మంచి ఆటతీరు కనబరుస్తూ అభిమానుల గుండెల్లో నిలుస్తుంటారు. అయితే వారు సంపాదనలోనూ గొప్పగానే ఉంటారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా కూడా వేల కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఈ టాప్ 5 ఆటగాళ్లు సంపాదనలో అంబానీతో పోటీపడుతున్నారు. ఆ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ "క్రికెట్ దేవుడు" అని పిలుస్తారు. సచిన్ టెండూల్కర్ అద్భుతమైన కెరీర్ అతన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా నిలిపింది. టెండూల్కర్ 170 మిలియన్ డాలర్ల నికర విలువ కలిగిన అత్యంత ధనవంతుడైన క్రికెటర్ గా నిలిచారు.
మహేంద్ర సింగ్ ధోని
వికెట్ కీపింగ్ నైపుణ్యాలకు పేరుగాంచిన MS ధోని $111 మిలియన్ల నికర విలువను సంపాదించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అతని విజయవంతమైన కెప్టెన్సీ,పలు ఎండార్స్‌మెంట్‌లు అతని సంపదకు పెరుగుదలకు దోహదపడ్డాయి. ఈ జాబితాలో ధోని ప్రపంచంలో, భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నికర విలువ $92 మిలియన్లు. అత్యంత ధనవంతులైన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్
విధ్వంసక బ్యాటింగ్‌కు పేరుగాంచిన వీరేంద్ర సెహ్వాగ్ $40 మిలియన్ల నికర విలువను సంపాదించాడు. దూకుడు ఆటతీరు, ఐపీఎల్‌లో విజయవంతమైన ప్రదర్శన,వ్యాఖ్యాత కెరీర్ అతని సంపదను పెంచాయి. ధనవంతులైన క్రికెటర్లలో సెహ్వాగ్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో అతని ర్యాంక్ 8వది
యువరాజ్ సింగ్
భారతదేశ ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు పేరుగాంచిన యువరాజ్ సింగ్ నికర విలువ $35 మిలియన్లు. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో యువరాజ్ ఐదవ స్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో ర్యాంక్ 10వది.