IPL 2024: ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు
IPL 2024: RCB 263 పరుగుల రికార్డ్ బ్రేక్ చేసిన SRH
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ స్కోరు నమోదైంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఇప్పటిదాకా ఉన్న 263 పరుగుల రికార్డ్‌ను 277 పరుగులతో SRH బ్రేక్ చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు హైదరాబాద్ జట్టును కట్టడి చేయడంలో విఫలమైంది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచే ముంబైపై విరుచుకుపడ్డారు. బౌండరీల మోతతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62... అభిషేక్ శర్మ 23 బంతుల్లో 63.. క్లాసీన్ 34 బంతుల్లో 80 పరుగులతో విధ్వంసం సృష్టించారు. దీంతో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది సన్‌రైజర్స్.