KL Rahul: 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్ చేయలేనిది.. ఇంగ్లాండ్‌లో కేఎల్ రాహుల్ సాధించాడు
KL Rahul: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టుకు కేఎల్ రాహుల్ నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడమే.
KL Rahul: 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్ చేయలేనిది.. ఇంగ్లాండ్‌లో కేఎల్ రాహుల్ సాధించాడు
KL Rahul: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టుకు కేఎల్ రాహుల్ నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడమే. ఈ ఇద్దరు దిగ్గజాలు లేని సమయంలో రాహుల్ జట్టులో అత్యంత సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా మారాడు. అయితే, అతని మునుపటి రికార్డులను చూసి సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ, మొదటి టెస్ట్ నుంచే రాహుల్ ఆ సందేహాలను పటాపంచలు చేశాడు. కేవలం 4 టెస్టుల్లోనే సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజం కూడా తన కెరీర్‌లో ఎన్నడూ సాధించలేని ఒక ఘనతను నమోదు చేశాడు.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన తర్వాత, టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. జట్టు అప్పటికి ఇంకా ఖాతా తెరవలేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌పై అందరి దృష్టి పడింది. అయితే, ఈ సిరీస్‌లోని మునుపటి మ్యాచ్‌లలో మాదిరిగానే, కష్టమైన పరిస్థితుల్లో రాహుల్ మరోసారి జట్టును ఆదుకొని, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
మ్యాచ్ నాలుగో రోజున రాహుల్, కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి 174 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇద్దరూ తమ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆట ముగిసే సమయానికి రాహుల్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 79 పరుగుల స్కోరు చేరుకోగానే, కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అతను కేవలం 8 ఇన్నింగ్స్‌లలోనే ఈ మార్కును చేరుకోవడం విశేషం. అంతేకాదు, రాహుల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇలా ఒక సిరీస్‌లో 500 పరుగులు చేయడం ఇదే మొదటిసారి. ఒక టెస్ట్ సిరీస్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం కూడా రాహుల్‌కు ఇదే తొలిసారి.
కేఎల్ రాహుల్ సాధించిన ఈ ఘనత చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు,సెంచరీలు సాధించిన గొప్ప బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ కూడా తన 24 ఏళ్ల కెరీర్‌లో, 200 టెస్ట్ మ్యాచ్‌లలో, ఒక టెస్ట్ సిరీస్‌లో 500 పరుగుల మార్కును ఎప్పుడూ అందుకోలేకపోయాడు. సచిన్ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన 2007-08లో ఆస్ట్రేలియా పర్యటనలో సాధించాడు. అప్పుడు అతను 4 టెస్టుల 8 ఇన్నింగ్స్‌లలో 493 పరుగులు మాత్రమే చేశాడు.