PAK vs BAN: ఎట్టకేలకు పాకిస్తాన్ కు దక్కిన విజయం

PAK vs BAN: బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో గెలుపు

Update: 2023-11-01 01:46 GMT

PAK vs BAN: ఎట్టకేలకు పాకిస్తాన్ కు దక్కిన విజయం

PAK vs BAN: వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా చేతిలో ఓటమి తర్వాత వరుసగా నాలుగు మ్యాచులు ఓడిపోయింది పాక్. ఆ తర్వాత ఎట్టకేలకు బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మంగళవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన పోరులో పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌కు ఇది మూడో విజయం కాగా.. ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా 56, లిటన్‌ దాస్‌ 45, కెప్టెన్‌ షకీబ్‌ 43 పరుగులు చేశారు. పాకిస్థాన్‌ బౌలర్లలో షాహిన్‌ షా అఫ్రిది, మహమ్మద్‌ వసీమ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్‌ 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫఖర్‌ జమాన్‌ 74 బంతుల్లో 81, అబ్దుల్లా షఫీఖ్‌ 68 రన్స్‌తో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌ మిరాజ్‌ మూడు వికెట్లు తీశాడు. పాక్ బ్యాట్స్‌మెన్‌ ఫకార్‌ జమాన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Tags:    

Similar News