Sachin Tendulkar: సచిన్.. కరోనాను కూడా సిక్స్ కొట్టగలవ్: వసీం అక్రం

Sachin Tendulkar: క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు.

Update: 2021-04-02 15:04 GMT

సచిన్, వసీం అక్రమ్ (ఫొటో ట్విట్టర్)

Sachin Tendulkar: క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. పాజిటివ్ గా తేలిన ఆరు రోజుల తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడిమాలో వెల్లడించారు. "డాక్టర్ల సలహాల మేరకు ఆస్పత్రిలో చేరాను. కోలుకున్న వెంటనే తిరిగి వస్తాను. నాకోసం ప్రార్థించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 2011 ప్రపంచ కప్ 10వ వార్షికోత్సవం సందర్భంగా భారతీయులందరికీ, నా తోటి ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు.'' అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు టెండూల్కర్. ఈమేరకు పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్.. ట్విటర్ లో సచిన్‌కు ధైర్యం చెప్పాడు.

" సచిన్.. 16 ఏళ్ల వయసులోనే నువ్వు ప్ర‌పంచ అత్యుత్తమ బౌల‌ర్ల‌ను గడగడలాడించావు. నువ్వు క‌చ్చితంగా కొవిడ్‌-19ను సిక్స్ కొట్ట‌గ‌ల‌వు. త్వ‌ర‌గా కోలుకో మాస్ట‌ర్‌. భారత్ 2011 వ‌రల్డ్‌క‌ప్ విజ‌యాన్ని నువ్వు డాక్ట‌ర్లు, ఆసుపత్రి సిబ్బందితో జ‌రుపుకుంటావని ఆశిస్తున్నా. అలాంటి ఫొటో నాకు పంపించు " అని అక్ర‌మ్ ట్వీట్ చేశాడు. 1990ల్లో వ‌సీం అక్ర‌మ్‌, స‌చిన్ టెండూల్క‌ర్ మ‌ధ్య మైదానంలో గట్టి పోటీ ఉండేది. ఎక్కువసార్లు స‌చిన్‌దే పైచేయిగా నిలిచింది.

సచిన్‌ టెండూల్కర్‌ కు మార్చి 27న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తన కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు శుక్రవారం ఆయన ఆస్పత్రిలో చేరారు. కాగా, ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సరీస్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లకు కరోనా సోకిన విషయం తెలిసిందే. సచిన్ తో పాటు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రినాథ్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

Tags:    

Similar News