నేను ప్రానాణలతోనే ఉన్న.. మృతి వార్తలపై పాక్ బౌలర్ సీరియస్

Update: 2020-06-22 13:24 GMT
Mohammad Irfan (File Photo)

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ కారు ప్రమాదంలో మరణిచాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో అతని మృతిపై అభిమానులు సంతాపం తెలియజేస్తూ నెట్టింట్లో పోస్టులు చేశారు. క్రికెట్‌లో అతను సాధించిన ఘనతల్ని గుర్తుచేసుకున్నారు. కారు ప్రమాదంలో తాను మరణించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మహ్మద్ ఇర్ఫాన్ స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమని చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో తప్పుడు కథనాల కారణంగా తన కుటుంబం, ఫ్రెండ్స్, సన్నిహితులు డిస్ట్రబ్ అయినట్లు వెల్లడించిన ఇర్ఫాన్.. వారి నుంచి లెక్కకి మించి ఫోన్‌కాల్స్ వచ్చాయన్నాడు. ఆఖరిగా తనకి ఎలాంటి యాక్సిడెంట్ కాలేదని స్పష్టం చేశాడు.

అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తప్పిదం కారణంగానే ఈ రూమర్స్ వ్యాపించాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం కారణంగా దివ్యాంగ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోషల్ మీడియాలో తెలియజేసింది. దివ్యాంగ క్రికెటర్ మహ్మద్ ఇర్ఫాన్ స్పష్టంగా చెప్పలేదని తెలుస్తోంది. పాక్ జట్టుకి సుదీర్ఘకాలంగా ఆడుతున్న మహ్మద్ ఇర్ఫాన్ కి చిక్కులు తెచ్చిపెట్టింది.

మహ్మద్ ఇర్ఫాన్ పాకిస్థాన్ తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 22 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 చివర్లో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ ఆడిన ఇర్ఫాన్.. ఆ సీరీస్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్ పర్యటనకి ఎంపికైనా పాక్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.

Tags:    

Similar News