సచిన్ కి వెరీవెరీ స్పెషల్ డే

స‌చిన్ టెండూల్కర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు.. 24 ఏళ్ల తన క్రికెట్ కెరియర్ లో ఎన్నో పరుగులు, మరెన్నో రికార్డులు స‌చిన్ ఆటకు దాసోహం అన్నాయి.

Update: 2020-03-16 14:41 GMT
Sachin Tendulkar Scored His 100th International Century

స‌చిన్ టెండూల్కర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు.. 24 ఏళ్ల తన క్రికెట్ కెరియర్ లో ఎన్నో పరుగులు, మరెన్నో రికార్డులు స‌చిన్ ఆటకు దాసోహం అన్నాయి.16 ఏళ్లకే అంత‌ర్జాతీయ‌ క్రికెట్ లోకి అడుగుపెట్టిన స‌చిన్ 100 శతకాలను సాధించి చరిత్ర సృష్టించాడు. 2012లో ఆసియాక‌ప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌ లో సచిన్ 100 శతకాల ఘనతను అందుకున్నాడు. సచిన్ ఈ ఘనతను అందుకొని నేటికి ఎనమిది సంవత్సరాలు అవుతుంది. ఆ మ్యాచ్ లో సచిన్ తన 49వ సెంచరీని పూర్తి చేశాడు. అప్పటికే టెస్టుల్లో 51 సెంచరీలు పూర్తి చేయడంతో 100 శతకాలను సాధించాడు.. కానీ ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది.

ముందుగా టాస్ గెలిచిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 290 ప‌రుగులు చేయ‌గా, బంగ్లా జట్టు ఇంకా నాలుగు బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. ఇక సచిన్ 2013లో వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండు టెస్టుల సిరీస్ అనంతరం క్రికెట్‌కు అన్ని ఫార్మాట్లలో గుడ్ బై చెప్పాడు. ఇక సచిన్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో 164 అర్ధసెంచ‌రీలు పూర్తి చేశాడు. ఇక అత్యధిక సెంచ‌రీల జాబితాలో సచిన్ తర్వాత 71 సెంచ‌రీలతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉండగా, 70 సెంచ‌రీలతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లి చాలా దగ్గరలో ఉన్నాడు.. 

Tags:    

Similar News