Malaysia Open 2026: సెమీస్‌కు పీవీ సింధు.. గాయంతో వైదొలిగిన యమగుచి
Malaysia Open 2026: కౌలాలంపుర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Malaysia Open 2026: సెమీస్‌కు పీవీ సింధు.. గాయంతో వైదొలిగిన యమగుచి
Malaysia Open 2026: కౌలాలంపుర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత క్వార్టర్ ఫైనల్ పోరులో జపాన్ అగ్రశ్రేణి క్రీడాకారిణి, థర్డ్ సీడ్ అకానె యమగుచిపై సింధు విజయం సాధించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి సెట్‌ను 21-11 తేడాతో సునాయసంగా కైవసం చేసుకుంది. రెండో సెట్ ప్రారంభం కాకముందే, యమగుచి మోకాలి గాయంతో ఇబ్బంది పడుతూ కోర్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీంతో అంపైర్ సింధును విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో యమగుచిపై సింధు తన హెడ్-టు-హెడ్ రికార్డును 15-12కు మెరుగుపరుచుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంలో ఉన్న సింధు, మూడో ర్యాంకర్‌పై ఘనవిజయం సాధించడం విశేషం.
సెమీస్‌లో తలపడేది ఎవరితో?
చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన సింధుకు ఈ విజయం కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. సెమీ ఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన వాంగ్ జియి లేదా ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమా వార్దానిలలో ఒకరితో తలపడనుంది.