Sarfaraz Khan Fastest Fifty: 6, 4, 6, 4, 6, 4.. అభిషేక్ శర్మ ఓవర్లో ఊచకోత! టీమిండియా సెలెక్టర్లకు కొత్త తలనొప్పి?

విజయ్ హజారే ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. అభిషేక్ శర్మ ఓవర్లో 30 పరుగులు రాబట్టిన సర్ఫరాజ్ విధ్వంసం పూర్తి వివరాలు.

Update: 2026-01-09 07:14 GMT

దేశవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారించడంలో సర్ఫరాజ్ ఖాన్ స్టైలే వేరు. అయితే ఈసారి అతను పరుగుల వరద కాదు, ఏకంగా ‘సునామీ’ సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న ఈ ‘రన్ మెషీన్’.. టీమిండియా యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ సరికొత్త రికార్డులను తిరగరాశాడు.

ఒకే ఓవర్లో 30 పరుగులు.. మైదానం దద్దరిల్లింది!

తన సోదరుడు ముషీర్ ఖాన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్, చుక్కలు చూడటానికి సిద్ధంగా లేనని మొదటి బంతికే స్పష్టం చేశాడు. టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా, ఆ ఓవర్‌ను సర్ఫరాజ్ తన ఫేవరెట్ టార్గెట్‌గా మార్చుకున్నాడు.

ఆ ఓవర్ సాగిందిలా: 6, 4, 6, 4, 6, 4

కేవలం ఒకే ఓవర్లో 30 పరుగులు పిండుకుని అభిషేక్ శర్మను ఆత్మరక్షణలో పడేశాడు.

15 బంతుల్లోనే 50.. భారత్ తరపున సరికొత్త రికార్డు!

ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. లిస్ట్-ఏ (List-A) క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధశతకం బాదిన భారతీయ బ్యాటర్‌గా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు.

గతంలో 2020-21 సీజన్‌లో అతీత్ షేత్ (16 బంతులు) పేరిట ఉన్న రికార్డును సర్ఫరాజ్ బ్రేక్ చేశాడు.

మొత్తంగా 20 బంతుల్లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అంటే 58 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయంటే అతని బ్యాటింగ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

గంభీర్ & సెలెక్టర్లకు ‘స్వీట్’ తలనొప్పి..

సర్ఫరాజ్ ఖాన్ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో 75.75 సగటుతో 303 పరుగులు సాధించాడు. అతని స్ట్రైక్ రేట్ (190+) చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం నోరెళ్లబెడుతున్నారు.

స్టాట్స్ ఇలా: గత 38 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు.

గోవాపై కేవలం 56 బంతుల్లోనే సెంచరీ బాది 157 పరుగులతో చెలరేగాడు.

ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ను టీమిండియా తుది జట్టులో ఎలా సెట్ చేయాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అనేది ఇప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్ మరియు సెలెక్టర్లకు పెద్ద సవాల్‌గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం, "ఈ విధ్వంసం నీకు కనిపిస్తలేదా గంభీర్.. ఛాన్స్ ఇంకెప్పుడు ఇస్తావు?" అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు.

Tags:    

Similar News