Learn Guitar, Play Cards : గిటార్‌ నేర్చుకోండి.. పేకాట ఆడండి : బ్రెట్‌ లీ

Learn Guitar, Play Cards : అసలు ఈ ఏడాది ఐపీఎల్ మొదలవుతుందా లేదా అని అనుమానాలకి గత కొద్ది రోజుల క్రితం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే

Update: 2020-08-10 07:59 GMT
brett lee(File Photo)

Learn Guitar, Play Cards : అసలు ఈ ఏడాది ఐపీఎల్ మొదలవుతుందా లేదా అని అనుమానాలకి గత కొద్ది రోజుల క్రితం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ని భారత్ లో నిర్వహించేందుకు అవకాశం లేకపోవడంతో టోర్నీకి UAEకి షిఫ్ట్ చేసింది బీసీసీఐ.. అక్కడ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించేలా ప్లాన్ చేసింది బీసీసీఐ.. దీనికి సంబంధించిన షెడ్యుల్ ని త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. మొత్తం మ్యాచ్ లను యూఏఈలోని మూడు స్టేడియంలో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.

ఆటగాళ్ళ భద్రత కోసం బయో-సెక్యూర్ బబుల్‌ నిబంధనలను తీసుకువచ్చింది బీసీసీఐ.. అంటే ఆటగాళ్ళ పైన టోర్నీ ముగిసే వరకూ 24 గంటలూ పాటు నిఘా ఉంటుంది అన్నమాట.. ఎక్కడికి బయటకు వెళ్లడానికి వీలుండదు.. దాదాపు రెండు నెలల పాటు ఆటగాళ్ళు ఇలాగే ఉండాల్సి ఉంటుంది. అయితే ఇది వారికీ విసుగు రావచ్చునని, దీని నుంచి తప్పించుకోవడానికి ఆ సమయంలో గిటార్‌ నేర్చుకోమని లేదా పేకాట ఆడమని చెబుతున్నాడు ఆసీస్ మాజీ ఆటగాడు బ్రెట్‌ లీ..

ముందుగా ఆరోగ్యం కాపాడుకోవడం మన కర్తవ్యం.. భౌతిక దూరంతో పాటుగా కరోనా నిబంధనలన్నింటినీ ఆటగాళ్లు పాటించాలని అన్నాడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో నా హోటల్‌ గదిలో గిటార్‌ వాయించడాన్ని ఇష్టపడేవాణ్నినని చెప్పుకొచ్చాడు... నాకు బయటకు వెళ్లి గోల్ఫ్‌ ఆడాల్సిన అవసరం ఉండేది కాదని వెల్లడించాడు. దాదాపు ఎనిమిది వారాలు లీగ్‌ జరగనుంది కాబట్టి విసుగు రాకుండా గిటార్ నేర్చుకొండి .. లేదా పేకాట ఆడండి అంటూ చెప్పుకొచ్చాడు బ్రెట్‌ లీ..

ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు అనిల్‌ కుంబ్లే రూపంలో సరైన కోచ్‌ దొరికాడని,జట్టు ట్రోఫీ గెలిస్తే చూడాలని ఉందని పేర్కొన్నాడు బ్రెట్‌ లీ.. గతంలో ఆ జట్టు తరుపున బ్రెట్‌ లీ ఆడాడు.

Tags:    

Similar News