Furqan Bhat: పాలస్తీనా జెండాతో మ్యాచ్ ఆడిన జమ్ము కశ్మీర్ క్రికెటర్.. విచారణకు పోలీసుల సమన్లు

Furqan Bhat: జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఓ క్రికెటర్ హెల్మెట్‌పై పాలస్తీనా జెండా కనిపించడం వివాదాస్పదంగా మారింది.

Update: 2026-01-01 14:42 GMT

Furqan Bhat: పాలస్తీనా జెండాతో మ్యాచ్ ఆడిన జమ్ము కశ్మీర్ క్రికెటర్.. విచారణకు పోలీసుల సమన్లు

Furqan Bhat: జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్ సందర్భంగా ఓ క్రికెటర్ హెల్మెట్‌పై పాలస్తీనా జెండా కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై జమ్ము రూరల్ పోలీసులు స్పందించి క్రికెటర్‌తో పాటు టోర్నమెంట్ నిర్వాహకుడికి విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు.

జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జేకే11 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుర్కాన్ భట్ తన హెల్మెట్‌పై పాలస్తీనా జెండా గుర్తుతో బరిలోకి దిగాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు క్రికెటర్ పుర్కాన్ భట్‌తో పాటు టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్‌ను విచారణకు పిలిచారు. అంతేకాకుండా మ్యాచ్ నిర్వహణకు మైదానం అందించిన వ్యక్తిని కూడా ప్రశ్నించనున్నట్లు తెలిపారు.

నిన్న జమ్ము ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జేకే11 జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్‌ప్రీత్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుండగా, అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News