మూడో టీ20కి ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్

టీమిండియాతో జరగనున్న మూడో టీ20కి ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

Update: 2020-01-08 16:46 GMT
Isuru Udana File Photo

టీమిండియాతో జరగనున్న మూడో టీ20కి ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక బౌలర్ ఇసురు ఉడానా గాయం కారణంగా మూడో టీ20 నుంచి తప్పుకున్నాడు. ఇక మూడో టీ20లో ఉడానా అడే అవకాశం లేదని తెలసుస్తోంది. ఈ విషయాన్ని శ్రీలంక జట్టు కోచ్ విక్కీ ఆర్ధర్ కూడా ప్రకటనలో తెలిపారు. కీలక బౌలర్ దూరం కావడంతో లంక జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

మంగళవారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 142 పరుగులు చేసింది. భారత్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఇన్నింగ్స్ విరామ సమయంలో లంక బౌలర్లు ప్రాక్టీస్ చేశారు. శ్రీలంక పేస్ బౌలర్ ఇసురు ఉదానా కూడా వార్మప్ సెషన్‌లో పాల్గొ్న్నాడు. దీంతో రెండో టీ20లొ ఉదాన ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్ వేయలేదు. ఉదాన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. మూడో టీ20 నుంచి తప్పకున్నాడు. మూడో టీ20లో భారత్ నిలువరించాలంటే కీలక బౌలర్లు లంకకు అవసరం, ఆఖరి టీ20 కావడం నిర్ణయత్మక మ్యా్చ్ కు ముందు ఉదానా దూరమవ్వడం పెద్ద షాక్.

రెండో టీ20లో బ్యాటింగ్ వచ్చిన ఉదాన బ్యాటింగ్‌లో 2 బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి అవుటైయ్యాడు. రెండో టీ20లో ఓటమికి ఉదాన గాయంతో బౌలింగ్‌ చేయకపోవడం అని లంక సారథి లసిత్ మలింగ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తో తాము లైన్ ఆండ్ లెన్త్ బౌలింగ్ వేశాం. ఉదానా ఉంటే మాకు అదనపు బలం చేకురేది అని మలింగ అన్నారు. దీంతో ఇరసు ఉదానా స్థానంలో మూడో టీ20కి సినియర్  ఆటగాడు మ్యాథ్యుస్ ని తీసుకునే అవకాశం ఉంది. ఉదానా పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సిరీస్ లో తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు.

ఇండోర్ వేదికగా టీమిండియాతో మంగళవారం జరిగిన రెండో రెండో టీ20లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాదించింది. శ్రీలంక నిర్ధేశించిన 143 పరుగలు విజయ లక్ష్యాన్ని 15 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.ఈ మ్యాచ్ విజయంతో భారత్ 1-0తో ముందజలో ఉంది. ఇక సిరీస్ లో మిగిలిన మూడో టీ20 మ్యాచ్ శుక్రవారం పుణెలో జరగనుంది. గువహటిలో తొలి టీ20 వర్షం కారణంతో రద్దయిన సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News