Ishant Sharma: టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న ఇషాంత్‌శర్మ
Ishant Sharma for Test series: ఆస్ట్రేలియాతో జరగనునన్న టెస్టు సిరీస్‌కు టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్‌శర్మ సిద్ధమవుతున్నాడు..
Ishant Sharma (file image)
National | ఆస్ట్రేలియాతో జరగనునన్న టెస్టు సిరీస్‌కు టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్‌శర్మ సిద్ధమవుతున్నాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు నేషనల్ క్రికెట్ అకడమీ NCAలో కృషి చేస్తున్నాడు. ఐపీఎల్ 2020లో ఢిల్లి తరఫున బరిలోకి దిగిన ఇషాంత్‌శర్మ గాయపడి టోర్నీకి దూరమయ్యాడు. గాయం కారణంగా ఇషాంత్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ప్రస్తుతం ఇషాంత్ బెంగళూరులోని ఎన్‌సీఎలో పునరావాస కేంద్రంలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. NCA హెడ్ రాహుల్ ద్రావిడ్ ఇషాంత్ ఫిట్‌నెస్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు NCA తెలిపింది. టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే నాటికి ఫూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని ద్రావిడ్ బోర్డుకు సమాచారం ఇచ్చాడు. ఆసీస్ పర్యటనలో ఇషాంత్ కీలకపాత్ర పోషించనున్నాడు.