ఆ జట్లతో టీమిండియాకు అదృష్టం కలిసొస్తుందా..!? టైటిల్ ని గెలిచొస్తుందా..!!

Update: 2021-10-23 11:00 GMT

ఆ జట్లతో టీమిండియాకు అదృష్టం కలిసొస్తుందా..!? టైటిల్ ని గెలిచొస్తుందా..!!

T20 WorldCup 2021: క్వాలిఫైయర్ మ్యాచ్ లలో గెలిచి గ్రూప్ 2 లో స్థానం సంపాదించిన స్కాట్లాండ్, నమీబియా జట్లు ఇపుడు భారత జట్టు తరపున అదృష్టంగా మారనున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 2003 వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్.. నమీబియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్, గంగూలీ సెంచరీలతో చెలరేగడంతో 181 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే.

ఆ టోర్నమెంట్ లో ఫైనల్ కి చేరిన భారత్.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయి రన్నరప్ గా నిలిచింది. ఆ తరువాత 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ - స్కాట్లాండ్ తో జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ఆ తరువాతి మ్యాచ్ పాక్ తో తలపడిన భారత్ ఆ మ్యాచ్ లో విజయం సాధించి ఆ టోర్నీలో ఫైనల్ చేరి ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

అయితే తాజాగా గ్రూప్ 2లో ప్రస్తుతం చోటు సంపాదించిన స్కాట్లాండ్, నమీబియాలతో భారత్ లీగ్ దశలో మ్యాచ్ లు ఆడనుండటంతో గత ప్రపంచకప్ సెంటిమెంట్ మరోసారి ఈ ఏడాది కూడా రిపీట్ అయి భారత్ టీ20 ప్రపంచకప్ టైటిల్ ని గెలుస్తుందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News