Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇర్ఫాన్ పఠాన్‌కు ఉద్వాసన.. దీని వెనుక హార్దిక్ పాండ్యా ఉన్నాడా?
Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇర్ఫాన్ పఠాన్‌కు ఉద్వాసన.. దీని వెనుక హార్దిక్ పాండ్యా ఉన్నాడా?
Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇర్ఫాన్ పఠాన్‌కు ఉద్వాసన.. దీని వెనుక హార్దిక్ పాండ్యా ఉన్నాడా?
Irfan Pathan : ఐపీఎల్ 2025 కామెంట్రీ ప్యానెల్‌లో మాజీ భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ పేరు లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మొదట కొంతమంది క్రికెటర్లు ఇర్ఫాన్‌పై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కూడా వినిపించాయి. కానీ, అసలు నిజం వేరే ఉందని స్వయంగా ఇర్ఫాన్ పఠాన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజా నివేదికల ప్రకారం, టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వల్లే ఇర్ఫాన్ పఠాన్‌కు ఐపీఎల్ 2025లో కామెంటరీ చేసే అవకాశం రాలేదని తెలుస్తోంది. ఈ విషయం ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ ఇర్ఫాన్ వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.
ఈ సీజన్‌లో ఇర్ఫాన్ పఠాన్‌ను కామెంట్రీ నుంచి తొలగించడానికి కారణం ఐపీఎల్ 2024లో మొదలైంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అప్పగించినప్పుడు హార్దిక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో ఇర్ఫాన్ పఠాన్ కూడా హార్దిక్ ప్రదర్శన, కెప్టెన్సీపై కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలవడంతో హార్దిక్ పాండ్యా కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు ఐపీఎల్ 2025 మొదలవక ముందే ఇర్ఫాన్ పఠాన్‌కు కామెంట్రీ నుంచి ఉద్వాసన పలకడంతో, హార్దిక్ పాండ్యా ఈ నిర్ణయం వెనుక ఉన్నారనే పుకార్లు బయలుదేరాయి.
ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయంపై స్పందిస్తూ, తాను ఎప్పుడూ హార్దిక్ పాండ్యాను వ్యక్తిగతంగా విమర్శించలేదని చెప్పారు. "ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఉంటాయి. అందులో ఒక ఆటగాడు 14 తప్పులు చేస్తే, నేను కేవలం 7 సార్లే విమర్శిస్తాను. అంటే, నేను చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నానని అర్థం. తప్పులు జరిగినప్పుడు విమర్శించడం మా పని. ఒక కామెంటేటర్‌గా నా బాధ్యత ఆటగాడి పట్ల కాదు, ప్రేక్షకుల పట్ల. ఐపీఎల్ 2024లో కూడా నేను లైవ్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు తప్పు చేస్తే విమర్శించడంలో తప్పు లేదని చెప్పాను" అని ఇర్ఫాన్ అన్నారు.
హార్దిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో ఉపయోగించిన అభ్యంతరకరమైన పదజాలాన్ని తాను వ్యతిరేకించానని ఇర్ఫాన్ తెలిపారు. "క్రికెట్ ఆడితే విమర్శలు వస్తాయి. గొప్ప ఆటగాళ్లైన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లకు కూడా విమర్శలు ఎదురయ్యాయి. కానీ, వారు ఎప్పుడూ తమను తాము ఆట కంటే గొప్పవాళ్ళమని అనుకోలేదు. హార్దిక్ పట్ల వాడిన అసభ్యకరమైన పదజాలాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను" అని ఆయన అన్నారు.
ఇర్ఫాన్ పఠాన్ తమ కుటుంబం ఎప్పుడూ బరోడాకు చెందిన ఆటగాళ్లందరికీ సపోర్టు ఇచ్చిందని చెప్పారు. "దీపక్ హుడా అయినా, హార్దిక్ లేదా కృనాల్ పాండ్యా అయినా, మేము వారికి మద్దతు ఇవ్వలేదని ఎవరూ అనలేరు. నేను ఆటగాళ్ల టాలెంట్ ఎప్పుడూ ప్రోత్సహిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం వీవీఎస్ లక్ష్మణ్ కూడా స్టార్ స్పోర్ట్స్‌లో ఒక విషయం చెప్పారు. 2012లో ఇర్ఫాన్ చెప్పిన మాట వినకపోవడం తన తప్పు అని లక్ష్మణ్ ఒప్పుకున్నారు. ఒకవేళ వింటే హార్దిక్ అప్పట్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడేవాడు" అని ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.