IPL 2020: ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: కోహ్లి

IPL 2020: మ‌రికొద్ది రోజుల్లో యూఏఈ వేదిక‌గా ఐపీఎల్ 2020 సిరీస్ ప్రారంభం కానున్న‌ది. ఈ నేప‌థ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి సహచర ఆట‌గాళ్ల‌పై గ‌రం గ‌రం అయ్యాదంట‌. యూఏఈ కి వచ్చింది.

Update: 2020-09-02 09:47 GMT

Virat Kohli Asks Players To Respect Bio-Bubble Protocols

IPL 2020: మ‌రికొద్ది రోజుల్లో యూఏఈ వేదిక‌గా ఐపీఎల్ 2020 సిరీస్ ప్రారంభం కానున్న‌ది. ఈ నేప‌థ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి సహచర ఆట‌గాళ్ల‌పై గ‌రం గ‌రం అయ్యాదంట‌. యూఏఈ కి వచ్చింది. కేవ‌లం ఐపీఎల్ లో ఆడ‌డానికే త‌ప్ప.. స‌రదాగా ఎంజ‌య్ చేయ‌డానికి కాద‌ని తెలిపార‌ట‌.. కేవ‌లం క్రికెట్ పైనే దృష్టి మార‌ల్చాల‌ని‌, బయో సెక్యూర్ బబుల్ ని గౌరవించాలని సహచర ఆటగాళ్లకు సూచించాడు.

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో .. స‌ర‌దాగా దుబాయ్ లో ప‌ర్య‌టించ‌డం కాద‌ని, ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌లో ఆడే ఛాన్స్ రావడమే అదృష్ట‌మ‌ని. కాబట్టి టోర్నమెంట్ సాఫీగా సాగాలంటే ప్రతి ఒక్కరూ బయో బబుల్ రూల్ పాటించాల్సిందే' అని విరాట్ ఘాటుగానే అన్నాడంట‌. బయో సెక్యూర్‌ బబుల్‌' నిబంధనలు అనుసరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కోహ్లి స్పష్టం చేశాడు.

ఐపీఎల్ ఆరంభం నుంచి విజయం అంచుల దాకా వెళ్లి వెనక్కు తిరిగిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంద‌కు తగ్గట్టుగా విరాట్ త‌న జట్టును రెడీ చేస్తున్నారు.

బహుశా చాలా ఏళ్లుగా విరామం లేకుండా ఆడుతుండటం వల్ల ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నా తనకు ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదని కోహ్లి అన్నాడు. రెండు నెలల క్రితం అసలు ఐపీఎల్‌ జరిగే అవకాశం లేదని భావించామని… ఇప్పుడు మళ్లీ లీగ్‌లో ఒక్క చోట చేరడం సంతోషంగా ఉందని అతను అభిప్రాయ పడ్డాడు.

Tags:    

Similar News