IPL 2020: వార్మప్ మ్యాచ్‌ల‌‌ను నిర్వ‌హించండి

IPL 2020: వార్మప్ మ్యాచ్‌ల‌‌ను నిర్వ‌హించండి
x

ఐపీల్ 2020

Highlights

IPL 2020: మ‌రికొద్ది రోజుల్లో దుబాయి వేదిక‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభం కానున్న‌ది. ఈ త‌రుణంలో ఫ్రాంచైజీలన్నీ స‌న్నాహ‌క మ్యాచ్ ల‌ను నిర్వ‌హించాల‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ)కి కోరిన‌ట్టు తెలుస్తోంది.

IPL 2020: మ‌రికొద్ది రోజుల్లో దుబాయి వేదిక‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభం కానున్న‌ది. ఈ త‌రుణంలో ఫ్రాంచైజీలన్నీ స‌న్నాహ‌క మ్యాచ్ ల‌ను నిర్వ‌హించాల‌ని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ)కి కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ సీజ‌న్ ఈ నెల 19న ప్రారంభం కానున్నది. ప్రారంభ మ్యాచ్‌కు ముందు వామప్ మ్యాచ్‌లు నిర్వహించాలని, ఈ మ్యాచ్ వ‌ల్ల క్రీడాకారుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని తెలిపాయి.

అయితే.. స‌న్నాహ‌క మ్యాచ్‌లు నిర్వహించాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ 11 నుంచి 16 మధ్య జరిగే అవకాశం ఉందని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఈ మ్యాచ్‌ల‌పై ఒకటి, రెండు రోజుల్లో బీసీసీఐ.. ఐపీఎల్ 2020 షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వామప్ మ్యాచ్‌ల గురించి ఆలోచిద్దామనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది

ఇప్పటికే చెన్నై మినహా అన్ని టీమ్స్ నెట్ ప్రాక్టీస్ ప్రారంభించాయి. రేపు నిర్వహించే పరీక్షల్లో చెన్నై ఫ్లేయ‌ర్స్‌కు నెగటీవ్ వస్తే మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే చెన్నై ప్రారంభ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా లేదని, ఆర్సీబీ, ముంబై మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories