Top
logo

Suresh Raina: సురేశ్ రైనా ఫిర్యాదుపై స్పందించిన సీఎం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం.

Suresh Raina: సురేశ్ రైనా ఫిర్యాదుపై స్పందించిన సీఎం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం.
X

సురేష్ రైనా 

Highlights

Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బంధువులపై దుండ‌గులు దాడి చేసి అత్యంత కిరాత‌కంగా.. హత్య చేశారు. ఈ ఘ‌ట‌న‌పై రైనా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. పంజాబ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు

Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా బంధువులపై దుండ‌గులు దాడి చేసి అత్యంత కిరాత‌కంగా.. హత్య చేశారు. ఈ ఘ‌ట‌న‌పై రైనా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. పంజాబ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ దాడిపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని పంజాబ్ పోలీస్‌ యంత్రాంగానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేసును వీలైనంత త్వరగా చేధించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల పఠాన్‌కోట్‌లోని సురేశ్ రైనా మేనత్త ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఈ కార‌ణంతో ఐపీఎల్ 2020 సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా ఇటీవల యూఏఈ నుంచి భారత్‌కి వచ్చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘ‌ట‌న‌పై సురేశ్ రైనా సోషల్ మీడియాలో స్పందించారు. ''ఆరోజు రాత్రి ఏం జరిగిందో..? ఈరోజుకి కూడా మాకు స్పష్టంగా తెలియడం లేదు. పంజాబ్ పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపాలి. ఆ దాడి ఎవరు చేశారో..? తెలుసుకునే హక్కు మాకుంది. ఆ దుండగులు ఇలాంటి దాడులు ఎక్కడా చేయకుండా చర్యలు తీసుకోవాలి'' అని పంజాబ్ పోలీస్ విభాగం, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌కి రైనా ట్యాగ్ చేశాడు. దాంతో.. రైనా ట్వీట్‌పై వెంటనే ఎస్పీ ప్రభజ్యోత్ సింగ్ స్పందించారు.

Web TitleSuresh Raina To Amarinder Singh Over Attack On Family
Next Story