Rajasthan Royal's New Jersey: రాయల్ 'జెర్సీ'

Rajasthan Royal's New Jersey: యూఏపీ వేదిక జ‌రుగుతున్న ఐపీఎల్ 2020 కి రంగం సిద్ధం అవుతుంది. మరో వారం రోజుల్లో ఈ ఉత్కంఠ పోరు ప్రారంభ అవ్వ‌నున్న‌ది. దీని కోసం అన్ని జ‌ట్టు ముమ్మ‌రంగా సాధ‌న చేస్తున్నాయి.

Update: 2020-09-10 10:10 GMT

 rajasthan royal

Rajasthan Royal's New Jersey: యూఏపీ వేదిక జ‌రుగుతున్న ఐపీఎల్ 2020 కి రంగం సిద్ధం అవుతుంది. మరో వారం రోజుల్లో ఈ ఉత్కంఠ పోరు ప్రారంభ అవ్వ‌నున్న‌ది. దీని కోసం అన్ని జ‌ట్టు ముమ్మ‌రంగా సాధ‌న చేస్తున్నాయి. ఈ క‌రోనా నేప‌థ్యం జ‌రుగుతున్న ఈ లీగ్ అయినా ఏ మాత్రం జోష్ త‌గ్గ‌కుండా వినూత్న ఏర్పాటు చేస్తూ.. అభిమానుల్లో మరింత ఉత్కంఠ‌ను పెంచుతున్నారు. తాజాగా రాజాస్ధాన్ రాయల్స్ ప్రాంచైజీ 13వ సీజన్‌ కోసం ఆటగాళ్లకు కొత్త జెర్సీలు అందించింది. అయితే వినూత్న రీతిలో జెర్సీని ఆవిష్కరించింది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (యుఎఇ)లోని ఒక బీచ్‌లో స్కైడైవర్ విమానం నుంచి దూకుతూ రాజస్ధాన్ రాయల్స్ జెర్సీని అవిష్కరించారు. రాయల్‌ మిరాజ్‌ రిసార్ట్‌ వద్ద దిగిన రోమన్‌ రాయల్స్‌ .. రాయల్స్ ప్లేయర్లకు కొత్త జెర్సీలను అందజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చెస్తోంది. రాయల్ లుక్‌లో రాజస్థాన్‌ ఐపీఎల్ 2020 జెర్సీ కనిపిస్తోంది.

ఐపీఎల్ 2020 కోసం ఇప్పుడే జెర్సీ ల్యాండ్ అయిందనే క్యాప్షన్‌తో కొత్త వేదిక, కొత్త జెర్సీ అర్ధం వచ్చేలా ఆ వీడియోను రాజాస్ధాన్ రాయల్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక ఐపీఎల్‌-13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19న ప్రారంభంకానుండగా.. రాజస్థాన్‌ 22న షార్జాలో జరిగే తన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. 


Tags:    

Similar News