IPL 2020 : తొలి మ్యాచ్ RCB vs KKR?
IPL 2020 : మరో రెండు వారాల్లో ఐపీఎల్ పదమూడవ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సీజన్ కి సంబంధించిన
IPL 2020 first match could be between the Royal Challengers Bangalore and Kolkata Knight Riders
IPL 2020 : మరో రెండు వారాల్లో ఐపీఎల్ పదమూడవ సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఈ సీజన్ కి సంబంధించిన షెడ్యుల్ మాత్రం వెలువడలేదు.. తాజా సమాచారం మేరకు ఈ రోజు(సెప్టెంబర్ 05) రాత్రి లేదా రేపు షెడ్యుల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఐపీఎల్ నిర్వాహకులు శనివారం ట్విటర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను వదిలారు. ఇందులో 'డ్రీమ్ 11 ఐపీఎల్‌కు ఇంకా 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఆగలేకపోతున్నాం' అని పేర్కొన్నారు.. అంతటితో ఆగకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్‌ల ఫొటోలను ఆ పోస్టర్ పైన ఉంచారు. దీనితో ఐపీఎల్ 13 వ సీజన్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య జరగనుందని ఉహాగానాలు వస్తున్నాయి. కానీ దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.
వాస్తవానికి అయితే గతేడాది ఫైనల్‌కు చేరిన జట్లతోనే కొత్త ఏడాది టోర్నీని మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే మొదటి మ్యాచ్ ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. ఐపీఎల్ నిర్వాహకులు కూడా కరోనాకి ముందు షెడ్యుల్ ని ప్లాన్ చేశారు. కానీ ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు కరోనా బారిన పడటం, ఆ జట్టు క్వారంటైన్ గడువు పెరగడంతో షెడ్యూల్‌లో మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. అందువల్లే కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అందులో కోహ్లీ, దినేశ్ కార్తిక్ ల ఫొటోలని ఉంచారని సమాచారం.. ఒకవేళ ఇదే నిజం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ సీజన్ ప్రారంభ మ్యాచ్ లలో పోటిపడడం రెండోసారి అవుతుంది. 2008లో మొదలైన ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో ఈ రెండు జట్లు తలపడ్డాయి.