IPL 2020: యూఏఈకి చేరుకున్న సీపీఎల్ ఆటగాళ్లు
IPL 2020: ఐపీఎల్ 2020 క్రీడా సమరం కోసం వెస్టిండీస్ క్రికెటర్లు యూఏఈలో అడుగుపెట్టారు. గత గురువారం వరకూ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన విండీస్ ఆటగాళ్లు.. పొలార్డ్, సునీల్ నరైన్, రూథర్ ఫర్డ్,డ్వేన్ బ్రావో, అలీ ఖాన్ తదితరులు శనివారం యూఏఈకి చేరుకున్నారు
IPL 2020: CPL players start reaching UAE
IPL 2020: ఐపీఎల్ 2020 క్రీడా సమరం కోసం వెస్టిండీస్ క్రికెటర్లు యూఏఈలో అడుగుపెట్టారు. గత గురువారం వరకూ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన విండీస్ ఆటగాళ్లు.. పొలార్డ్, సునీల్ నరైన్, రూథర్ ఫర్డ్,డ్వేన్ బ్రావో, అలీ ఖాన్ తదితరులు శనివారం యూఏఈకి చేరుకున్నారు. బీసీసీఐ నిబంధనల మేరకు విమాన ప్రయాణం చేసి ఉన్నందున.. ఆరు రోజుల పాటు వారు క్వారంటైన్‌లో ఉండనున్నారు.
ఐపీఎల్ 2020 సీజన్‌ని బయో- సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తుండగా.. ఆ బబుల్‌లోకి క్వారంటైన్, కరోనా టెస్టులు పూర్తయిన తర్వాత క్రికెటర్‌కి అనుమతి ఉంటుంది. ఇతర ఆటగాళ్లు కూడా ఈ నియమాలను పాటించిన విషయం తెలిసిందే.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఈరోజు నుంచి ఆరు రోజుల పాటు వెస్టిండీస్ క్రికెటర్లు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ ఆరు రోజుల్లోనే వారికి మూడు సార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనుండగా.. మూడింట్లోనూ నెగటివ్ వస్తేనే బబుల్‌లోకి ఎంట్రీ ఉంటుంది. వీరందరూ వారివారి తొలి మ్యాచ్ ను మిస్ అయ్యేట్టు కనిపిస్తుంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్‌గా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ టీమ్‌ని విజేతగా నిలిపిన కీరన్ పొలార్డ్.. 207 పరుగులు చేసి మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఇతడి రాకతో ముంబయి ఇండియన్స్ టీమ్‌కు మరింత బలం చేకూరిందనే చెప్పాలి.